అక్షరటుడే, వెబ్డెస్క్ : Burqa Incident Korutla Busstand | జగిత్యాల జిల్లా (Jagtial District) కోరుట్లలో ఓ యువకుడు బుర్కా వేసుకొని ఆర్టీసీ బస్టాండ్ (RTC Busstand)లో మహిళల మధ్య కూర్చున్నాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బస్టాండ్లో మహిళ ప్రయాణికుల మధ్య బుర్కా వేసుకొని ఓ యువకుడు కూర్చున్నాడు. అతడు ఫోన్ మాట్లాడుతున్న సమయంలో మగ గొంతు వినిపించడంతో మహిళలకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. సదరు యువకుడిని ప్రశ్నించగా.. రీల్స్ కోసం బుర్కా వేసుకున్నట్లు చెప్పడం గమనార్హం. అయితే అతడు రీల్స్ కోసం చేశాడా.. మహిళలను ఇబ్బంది పెట్టడానికి అలా చేశాడా అనేది తెలియరాలేదు. ఉచిత బస్సు కోసం చేశాడా మరేదైనా కారణం చేత చేశారా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. అయితే అతడిని అధికారులు ప్రశ్నిస్తున్న సమయంలో నవ్వుతూ సమాధానం ఇవ్వడం గమనార్హం. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు కోరతున్నారు.