అక్షరటుడే, ఆర్మూర్: Korutla Accident | దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా దంపతులు దుర్మరణం చెందిన ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరణించిన దంపతులు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.
Korutla Accident | గ్రామంలో విషాద ఛాయలు
మంథని గ్రామానికి చెందిన కోటగిరి మోహన్ దంపతులు తమ కూతురితో కలిసి శనివారం కొండగట్టు దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా కోరుట్ల సమీపంలో వీరి కారును లారీ బలంగా ఢీకొంది. దీంతో దంపతులిద్దరూ అక్కడికక్కడే మరణించారు. కూతురు తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆర్మూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదంలో దంపతులిద్దరు మరణించడంతో మంథని గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. కాగా, ప్రమాద ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.