అక్షరటుడే, కమ్మర్పల్లి: Kammarpally Mandal | ప్రత్యేక రాష్ట్ర సాధనలో కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివని బాల్కొండ నియోజకవర్గ (Balkonda Constituency) కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ పేర్కొన్నారు.
కమ్మర్పల్లి మండల (Kammarpally Mandal) కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కోసం 90 ఏళ్ల వయస్సులోనూ కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేశారని కొనియాడారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకెట రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పద్మశాలి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.