అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Konda Laxman Bapuji | స్వాతంత్య్ర సమరయోధులు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని ఉమ్మడి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఆయన అలుపెరుగని పోరాటాలు చేశారని పలువురు వక్తలు వ్యాఖ్యానించారు.
Konda Laxman Bapuji | ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో..
నిజామాబాద్ జిల్లా ఆయుష్ (AYUSH Nizamabad) ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా జీజీహెచ్లో (GGh Nizamabad) ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి జిల్లా ఆయుష్ విభాగం ఇన్ఛార్జి డాక్టర్ జె గంగాదాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో యోగా వైద్యుడు తిరుపతి, ఆయుష్ విభాగం ఫార్మసిస్ట్లు న్యావనంది పురుషోత్తం, ఉమాప్రసాద్, నీరజ, పారామెడికల్ సిబ్బంది రమేష్, భిక్షపతి, టీబీ విభాగం ఉద్యోగులు, డయాలసిస్ కేంద్రం ఉద్యోగులు పాల్గొన్నారు.
Konda Laxman Bapuji | జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో..
నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం (Padmashali sangham Nizamabad) ఆధ్వర్యంలో వినాయక్ నగర్లోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఏర్పాటు కోసం చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు మైసల నారాయణ, ఉపాధ్యక్షులు గాలిపల్లి నారాయణ, సహాయ కార్యదర్శి పద్మ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి నివాళులర్పిస్తున్న జిల్లా పద్మశాలి సంఘం ప్రతినిధులు