అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Konda Surekha | రాష్ట్ర మంత్రుల మధ్య తరచూ వివాదం చెలరేగుతోంది. ఇప్పటికే పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య వివాదం తలెత్తగా, తాజాగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ(Konda Surekha) మధ్య అగాధం పెరిగి పోయింది. దీనిపై కొండా దంపతులు హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasreddy)పై వరంగల్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు కొండా దంపతులు పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి వరంగల్ జిల్లా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కొండా మురళి ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే, పొంగులేటి వ్యవహారాన్ని సోనియా(Sonia Gandhi), రాహుల్, మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) దృష్టికి తీసుకెళ్లారు. పొంగులేటి వరంగల్ జిల్లా రాజకీయాల్లో మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని కొండా మురళి ఆరోపించారు.
Konda Surekha | టెండర్లలోనూ జోక్యం..
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని కొండా మురళి(Konda Murali) ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడారం టెండర్ల వ్యవహారంపైనా ఆయన హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. పొంగులేటి సొంత కంపెనీకి కాంట్రాక్టులు ఇప్పించుకున్నారని ఆరోపించారు. ఆయనకు సంబంధం లేని దేవాదాయ శాఖలోనూ జోక్యం చేసుకుంటున్నారని తెలిపారు. అలాగే వరంగల్ జిల్లా రాజకీయాల్లో తమను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని కొండా దంపతులు ఫిర్యాదు చేశారు. ఇది ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందని తెలిపారు. తమ ఫిర్యాదుపై హైకాండ్ నుంచి సానుకూల స్పందన వచ్చిందన్న కొండా దంపతులు తెలిపారు.