ePaper
More
    HomeతెలంగాణKonatham Dilip | హైకోర్టు ఆదేశాలు బేఖాతరు..! కొణతం దిలీప్ అరెస్టు.. ఖండించిన హరీష్​రావు

    Konatham Dilip | హైకోర్టు ఆదేశాలు బేఖాతరు..! కొణతం దిలీప్ అరెస్టు.. ఖండించిన హరీష్​రావు

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Konatham Dilip : ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి నాయకుడు(Opposition Bharat Rashtra Samithi leader), BRS సోషల్ మీడియా social media ఇం​ఛార్జి, తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ former director of Telangana Digital Media కొణతం దిలీప్​ను పోలీసులు అరెస్టు చేశారు. అమెరికా America నుంచి వచ్చిన ఆయనను శంషాబాద్ ఎయిర్ పోర్టు Shamshabad airportలో అదుపులోకి తీసుకున్నారు.

    తన తండ్రి బక్కారెడ్డి జ్ఞాపకాల Bakka Reddy’s memoirs పుస్తకావిష్కరణ కార్యక్రమం book launch program లో పాల్గొనడానికి కొణతం దిలీప్ గత నెల 18న అమెరికా వెళ్లారు. వర్జీనియా Virginia లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళవారం రాత్రి హైదరాబాద్​లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.

    దిలీప్​ను అరెస్టు చేసిన అనంతరం ఆయనను పోలీసులు నిర్మల్‌ కు తరలించారు. నిర్మల్ పోలీస్ స్టేషన్ లో ఇదివరకు దిలీప్​పై ఎఫ్ఐఆర్ (నంబర్ 353) నమోదైంది. ఈ కేసు విషయంలోనే ఆయనను అరెస్ట్ చేసినట్లు సమాచారం.

    తెలంగాణలోని వేర్వేరు పోలీస్ స్టేషన్లల్లో కొణతం దిలీప్‌ మీద పలు కేసులు నమోదై ఉన్నాయి. గత సంవత్సరం దిలీప్ పై లుక్ అవుట్ సర్క్యులర్ సైతం జారీ చేయబడింది. దీనిని సవాలు చేస్తూ హైకోర్టును దిలీప్​ ఆశ్రయించారు. ఈ మేరకు అమెరికాలో తన తండ్రి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి కోర్టు అనుమతి ఇచ్చింది.

    కాగా, స్వదేశానికి తిరిగివచ్చిన వెంటనే దిలీప్​ అరెస్టు అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం Congress government పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నందుకే కొణతం దిలీప్‌ను అరెస్టు చేశారంటూ బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. వారి వైఫల్యాలను ప్రశ్నించినందుకే రేవంత్ ప్రభుత్వం అరెస్టులతో వేధింపులకు పాల్పడుతోందంటూ విమర్శిస్తున్నారు.

    దిలీప్​ అరెస్టును మాజీ మంత్రి హరీష్ రావు Former minister Harish Rao ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినందుకే దిలీప్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం అరెస్టు చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వం ఇలాంటి కక్షపూరిత చర్యలకు పాల్పడటం దుర్మార్గమన్నారు. హైకోర్టు High Court ఆదేశాలను బేఖాతరు చేయడం న్యాయస్థానాలను అవమానించడమేనని పేర్కొన్నారు. ప్రజా పాలన అని గొప్పగా చెప్పుకోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అనుసరిస్తోన్నదని హరీష్​రావు ఆరోపించారు. దిలీప్​ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

    More like this

    Revanth meet Nirmala | కళాశాల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...