ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKommineni Srinivas Rao | కొమ్మినేని శ్రీనివాస్ రావు అరెస్ట్ హేయనీయం

    Kommineni Srinivas Rao | కొమ్మినేని శ్రీనివాస్ రావు అరెస్ట్ హేయనీయం

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Kommineni Srinivas Rao | ఏపీలో ‘సాక్షి’ సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్ రావు (Senior Journalist Kommineni Srinivas Rao) అరెస్ట్ హేయనీయమని జర్నలిస్టులు నినదించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద అంబేడ్కర్ విగ్రహం ఎదుట నల్ల బ్యాడ్జీలతో టీయూడబ్ల్యూజే జర్నలిస్టులు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

    ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీలో పత్రికా స్వేచ్ఛకు భంగం కలుగుతుందన్నారు. అక్కడి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పూనుకుంటుందని పేర్కొన్నారు. టీవీ డిబేట్​ (Sakshi TV debate)లో జరిపిన చర్చల్లో దొర్లిన వ్యాఖ్యలను ఖండించడం కూడా జరిగిందన్నారు. అయినా కొమ్మినేని శ్రీనివాస్ రావును అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. వెంటనే అతన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

    ఈ నిరసనలో టీయూడబ్ల్యూజే (TUWJ) జిల్లా అధ్యక్షుడు రజినీకాంత్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు ( TUWJ Member of the National Council) వేణుగోపాల చారి, కామారెడ్డి జేఏసీ కన్వీనర్ జగన్నాథం, ప్రజాసంఘాల నాయకులు క్యాతం సిద్దిరాములు, ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంగల వెంకటి, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు లింగం, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు విఠల్, సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్ గౌడ్, విద్యార్థి సంఘాల నాయకులు అరుణ్, విఠల్, నాగరాజు, వినోద్, సురేష్, స్టాలిన్, జర్నలిస్టులు పాల్గొన్నారు.

    More like this

    Nara Lokesh | నేపాల్‌లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం.. సూపర్ సిక్స్-సూపర్ హిట్ కార్యక్రమాన్నిర‌ద్దు చేసుకున్న నారా లోకేష్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | నేపాల్‌(Nepal)లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అక్కడ చిక్కుకున్న తెలుగువారిని...

    YS Jagan | చంద్రబాబు పాలనపై విరుచుకుపడ్డ జగన్​.. ప్రభుత్వం ఉందా అని ఆగ్రహం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : YS Jagan | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandra Babu)...

    India-Pakistan | మ‌రో నాలుగు రోజుల్లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. ఇంకా అమ్ముడుపోని టిక్కెట్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India-Pakistan | అంతర్జాతీయ క్రికెట్‌(International Cricket)లో హై వోల్టేజ్‌గా పేరొందిన భారత్ vs పాకిస్తాన్...