ePaper
More
    HomeతెలంగాణRajagopal Reddy | మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    Rajagopal Reddy | మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajagopal Reddy | మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ(Cabinet Expansion)లో ఆయన పదవి ఆశించారు.

    అయితే సామాజికి సమీకరణాల నేపథ్యంలో రాజగోపాల్​రెడ్డికి కేబినెట్​ బెర్త్​ దక్కలేదు. బుధవారం ఆయన మాట్లాడుతూ. 2018 ఎన్నికల్లో నల్గొండలో కాంగ్రెస్​ ఎమ్మెల్యే(Congress MLA)లు అందరు ఓడిపోతే తాను మాత్రమే గెలిచానన్నారు. 2023 ఎన్నికల్లో ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే తనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పారన్నారు. కానీ తనకు మంత్రి పదవి కంటే మునుగోడు ప్రజలే ముఖ్యమన్నారు. అందుకే అక్కడి నుంచి పోటీ చేయలేదన్నారు.

    Rajagopal Reddy | అందుకే ఉప ఎన్నికల్లో ఓడిపోయా

    రాజగోపాల్​రెడ్డి 2018లో కాంగ్రెస్​ నుంచి మునుగోడు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం ఆయన పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2022 నవంబర్​లో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగ్గా.. బీజేపీ నుంచి రాజగోపాల్​రెడ్డి(Rajagopal Reddy) పోటీ చేశారు. బీఆర్​ఎస్​ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్​ రెడ్డి బరిలో నిలిచి విజయం సాధించారు. అయితే ఉప ఎన్నికల్లో ఓడిపోవడానికి గల కారణాన్ని తాజాగా రాజగోపాల్​ రెడ్డి వెల్లడించారు. ఆ ఎన్నికల్లో తనను ఓడించిది బీఆర్​ఎస్​ కాదని, కమ్యూనిస్టులని ఆయన పేర్కొన్నారు. కమ్యూనిస్టులు బీఆర్ఎస్​(BRS)కు మద్దతు తెలపడంతోనే ఉప ఎన్నికల్లో ఓడిపోయినట్లు చెప్పారు. ఉప ఎన్నికల్లో ఓడిపోయిన రాజగోపాల్​రెడ్డి అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) ముందు మళ్లీ కాంగ్రెస్​లో చేరి మునుగోడులో పోటీ చేసి గెలుపొందారు.

    READ ALSO  Padi Kaushik Reddy | ఈటల సీఎం కావాలనుకున్నారు.. పాడి కౌశిక్​రెడ్డి​ సంచలన వ్యాఖ్యలు

    Latest articles

    INDvsENG | నాలుగో టెస్ట్‌లోను టాస్ ఓడిన భార‌త్.. లంచ్ స‌మ‌యానికి భార‌త్ 78/0

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: INDvsENG | మాంచెస్ట‌ర్ వేదిక‌గా నేటి నుండి ఇంగ్లండ్‌- భార‌త్ (England and India) మ‌ధ్య...

    CM Revanth Reddy | దత్తాత్రేయను ఉప రాష్ట్రపతి చేయాలి.. సీఎం కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్​ నాయకుడు (BJP Leader)...

    Ultraviolette F77 | అల్ట్రావైలెట్ ఎఫ్‌77కు సరికొత్త పవర్.. ‘బాలిస్టిక్+’తో మెరుగైన పనితీరు!

    అక్షరటుడే, ముంబై: Ultraviolette F77 | ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో ముందున్న అల్ట్రావైలెట్ కంపెనీ, తమ ఎఫ్‌77...

    Ambati Rambabu | హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సూప‌ర్ డూప‌ర్ హిట్ కావాలి.. అంబ‌టి రాంబాబు ఆసక్తికర ట్వీట్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Ambati Rambabu | ఏపీ రాజకీయాల్లో వైసీపీ నేత అంబటి రాంబాబు మరియు జనసేన అధినేత,...

    More like this