ePaper
More
    HomeతెలంగాణRajagopal Reddy | సీఎం రేవంత్​రెడ్డి భాష మార్చుకోవాలి.. కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    Rajagopal Reddy | సీఎం రేవంత్​రెడ్డి భాష మార్చుకోవాలి.. కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rajagopal Reddy | కాంగ్రెస్​ పార్టీలో (Congress party) విబేధాలు రోజు రోజుకు రచ్చకెక్కుతున్నాయి. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి (MLA Komatireddy Rajagopal Reddy) కొంతకాలంగా బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకు పడుతున్నారు. తాజాగా ఆయన మరోసారి సీఎం రేవంత్​ రెడ్డి (CM Revanth Reddy) తన భాష మార్చుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్​లో రాజగోపాల్​ రెడ్డి బుధవారం మీడియా చిట్​చాట్​లో మాట్లాడారు.

    Rajagopal Reddy | తెలంగాణను దోచుకుంటున్నారు

    సీఎం రేవంత్​రెడ్డి ప్రతిపక్షాలను తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని రాజగోపాల్​రెడ్డి అన్నారు. గంటలు గంటలు మాట్లాడకుండా.. ఆ శ్రద్ధ పని మీద చూపించాలని హితవు పలికారు. సీమాంధ్ర కాంట్రాక్టర్లు (Seemandhra contractors) తెలంగాణను దోచుకుంటున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతానికి చెందిన 20 మంది కాంట్రాక్టర్లు ప్రభుత్వ సొమ్మును దోచుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

    READ ALSO  MLC Kavitha | నీళ్లు కూడా తాగను.. అరెస్ట్​ చేసినా దీక్ష కొనసాగిస్తా : ఎమ్మెల్సీ కవిత

    Rajagopal Reddy | మూడున్నరేళ్లే రేవంత్​ సీఎం

    సీఎం రేవంత్​రెడ్డి ఇంకా మూడున్నర ఏళ్లే పదవిలో కొనసాగుతారని ఆయన అన్నారు. ఆ తర్వాత ఎవరనేది తర్వాత తెలుస్తుందన్నారు. అందరూ కలిస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కాగా మరో పదేళ్లు తానే సీఎం అని ఇటీవల రేవంత్​రెడ్డి చేసిన వ్యాఖ్యలను సైతం రాజగోపాల్​రెడ్డి ఖండించిన విషయం తెలిసిందే.

    Rajagopal Reddy | అధిష్టానం హామీ ఇచ్చింది

    తనకు మంత్రి పదవి విషయంలో అధిష్టానం (high command) హామీ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. అందుకే బీజేపీ నుంచి కాంగ్రెస్​లో చేరినట్లు చెప్పారు. అయితే ఆ విషయం తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి (Komatireddy Venkat Reddy) తెలియదన్నారు. తనకు పదవుల కంటే మునుగోడు ప్రజలే ముఖ్యమని పేర్కొన్నారు. మంత్రి పదవి కావాలంటే అప్పుడే కేసీఆర్‌ ఇచ్చేవారని వ్యాఖ్యానించారు.

    READ ALSO  Fake Attendance | ఫేక్​ అటెండెన్స్​తో పంచాయతీ కార్యదర్శుల మోసం.. చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం

    Rajagopal Reddy | బీఆర్​ఎస్​ ఫ్రస్టేషన్​లో ఉంది

    బీఆర్​ఎస్​ పార్టీ (BRS Party) అధికారంలో కోల్పోయిన ఫ్రస్టేషన్​లో ఉందని రాజగోపాల్​రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్‌ కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​ అవినీతిలో (Kaleshwaram project corruption) బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​లో అక్రమాలకు పాల్పడ్డ కేసీఆర్​ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలలని రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

    Rajagopal Reddy | సోషల్​ మీడియా జర్నలిస్టులకు మద్దతు

    సోషల్​ మీడియా జర్నలిస్టులపై (social media journalists) ఇటీవల రేవంత్​రెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వారిని కట్టడి చేయాలని ఆయన అన్నారు. అయితే సీఎం వ్యాఖ్యలను కోమటిరెడ్డి ఖండించారు. సోషల్ మీడియా జర్నలిస్ట్​లకు ఆయన మద్దతు తెలిపారు. ఈ విషయంలో సీఎం రేవంత్​ రెడ్డి తీరు నది దాటే వరకు ఓడ మల్లన్న.. నది దాటాకా బోడ మల్లన్నలా ఉందని వ్యాఖ్యలు చేశారు. నిబద్ధతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

    READ ALSO  Indiramma Canteens | హైదరాబాద్​లో రూ.5కే టిఫిన్​.. ఎప్ప‌టి నుంచో తెలుసా..!

    Rajagopal Reddy | చర్యలు ఉంటాయా

    రాజగోపాల్​ రెడ్డి మంత్రి పదవి ఆశించారు. అయితే ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో అధిష్టానం ఆయనకు మొండి చెయ్యి చూపింది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో వాకటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్​కుమార్​, గడ్డం వివేక్​లకు మంత్రి పదవులు ఇచ్చింది. అప్పటి నుంచి రాజగోపాల్​రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. సీఎం రేవంత్​రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. బుధవారం ఢిల్లీలో చేపట్టిన బీసీ రిజర్వేషన్ల (BC reservation) ధర్నాకు సైతం ఆయన వెళ్లలేదు. ఈ క్రమంలో ఆయనపై పార్టీ చర్యలు తీసుకుంటుందా.. లేక బుజ్జగిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

    Latest articles

    Collector Nizamabad | వేల్పూర్​లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

    అక్షరటుడే, ఆర్మూర్ : Collector Nizamabad | వేల్పూర్ మండల కేంద్రంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి(Collector Vinay Krishna...

    Chat GPT | ఒక ప్రశ్నకు సమాధానానికి Chat GPTకి ఎంత నీరు అవసరం అవుతుందో తెలుసా?

    అక్షరటుడే, హైదరాబాద్: Chat GPT | చాట్​ జీపీటీ వంటి కృత్రిమ మేధ (artificial intelligence) టూల్స్ సమాచారం...

    Reserve Bank | అమెరికాకు ఆర్బీఐ కౌంటర్.. మృత ఆర్థిక వ్యవస్థ వ్యాఖ్యలను తిప్పికొట్టిన రిజర్వ్ బ్యాంక్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Reserve Bank | భారతదేశ ఆర్థిక వ్యవస్థ మృత ఆర్థిక వ్యవస్థ అని అమెరికా...

    ACB | ఏసీబీకి చిక్కిన మరో అధికారి.. రూ.22 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్టీవో

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: ACB | రాష్ట్రంలో ఏసీబీ అధికారులు (ACB officials) నిత్యం అవినీతి అధికారులను పట్టుకుంటున్నా వారిలో...

    More like this

    Collector Nizamabad | వేల్పూర్​లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

    అక్షరటుడే, ఆర్మూర్ : Collector Nizamabad | వేల్పూర్ మండల కేంద్రంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి(Collector Vinay Krishna...

    Chat GPT | ఒక ప్రశ్నకు సమాధానానికి Chat GPTకి ఎంత నీరు అవసరం అవుతుందో తెలుసా?

    అక్షరటుడే, హైదరాబాద్: Chat GPT | చాట్​ జీపీటీ వంటి కృత్రిమ మేధ (artificial intelligence) టూల్స్ సమాచారం...

    Reserve Bank | అమెరికాకు ఆర్బీఐ కౌంటర్.. మృత ఆర్థిక వ్యవస్థ వ్యాఖ్యలను తిప్పికొట్టిన రిజర్వ్ బ్యాంక్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Reserve Bank | భారతదేశ ఆర్థిక వ్యవస్థ మృత ఆర్థిక వ్యవస్థ అని అమెరికా...