అక్షరటుడే, వెబ్‌డెస్క్: Komatireddy Comments | కాంగ్రెస్ పార్టీ (Congress Party)పై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర నేతల ఢిల్లీ పర్యటన వేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై రాజకీయ వర్గాలో చర్చ సాగుతోంది. ఆయన ఏకంగా ఏఐసీసీ పెద్దలపైనే ఆరోపణలు చేయడంతో టీకాంగ్రెస్‌లో ఏం జరుగుతోందనే డిబెట్ నడుస్తోంది.
Komatireddy Comments | నాకు పార్టీ ఇచ్చి
ఓ యూట్యూబ్ చానల్ (YouTube channel)తో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరినప్పుడు నాకు మంత్రి పదవి ఆఫర్ చేశారన్నారు. అయితే ఆ మాటను పార్టీ నిలబెట్టుకుంటుందా లేదా అనేది తర్వాత విషయమని.. కానీ పార్టీ అధికారంలోకి వచ్చాక తనను పార్టీలోకి తీసుకువచ్చిన నేతలు తనపై ప్రవర్తించిన తీరు అవమానకరమని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల (Parliamentary Elections) వేళ కేసీ వేణుగోపాల్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి సీటు సాధిస్తే మీకిచ్చిన హామీని నెరవేరుస్తామని మాట ఇచ్చారన్నారు. అయితే హామీ నెరవేర్చడం పార్టీ ఇబ్బందులు ఉండొచ్చన్నారు. కానీ ఈ విషయాన్ని కనీసం పిలిచి చెప్పకపోవడం దుర్మార్గమంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Komatireddy Comments | బీజేపీ ఎంతో గౌరవించింది
రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఒంటెద్దు పోకడలు నచ్చక నేను బీజేపీకి వెళ్తే అక్కడ నన్ను ఎంతో గౌరవించారని కోమటిరెడ్డి అన్నారు. బీజేపీలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, స్టేట్‌లో స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ పదవి ఇచ్చారన్నారు. అంత గౌరవించినా.. కాంగ్రెస్ కన్నతల్లిలాంటిదని.. తిరిగి ఆహ్వానిస్తున్నారని వచ్చానని పేర్కొన్నారు. మంత్రి పదవి ఇవ్వకపోయిన పర్వాలేదని.. కానీ నన్ను అవమానించిన తీరు బాగోలేదని వ్యాఖ్యానించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తాను గెలిచి ఉంటే రాష్ట్ర రాజకీయం మరోలా ఉండేదనే విషయం.. ఇటీవల సీపీఐ ఎమ్మెల్యే నెల్లికంటి సత్యం (CPI MLA Nellikanti Satyam) కూడా చెప్పారని గుర్తు చేశారు.