ePaper
More
    HomeతెలంగాణTelangana Congress | సీఎం రేవంత్‌రెడ్డికి కోమ‌టిరెడ్డి కౌంట‌ర్‌.. సోషల్ మీడియా జర్నలిస్టులకు రాజగోపాల్‌రెడ్డి మద్దతు

    Telangana Congress | సీఎం రేవంత్‌రెడ్డికి కోమ‌టిరెడ్డి కౌంట‌ర్‌.. సోషల్ మీడియా జర్నలిస్టులకు రాజగోపాల్‌రెడ్డి మద్దతు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Congress | ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి , రాజ‌గోపాల్‌రెడ్డి మరోసారి సంచ‌ల‌న ట్వీట్ చేశారు. సోష‌ల్ మీడియా జ‌ర్న‌లిస్టుల‌పై సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. రేవంత్ వ్యాఖ్య‌ల‌ను కౌంట‌ర్ ఇస్తూ.. సోషల్ మీడియా జర్నలిస్టులకు రాజగోపాల్‌రెడ్డి(Rajagopal Reddy) మద్దతు ప్ర‌క‌టించారు. తెలంగాణ ఆకాంక్షల మేరకు సోషల్‌ మీడియా పనిచేస్తోందని, పాలకులు సోషల్ మీడియాను గౌరవించాలని హిత‌వు ప‌లికారు. సోషల్‌ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలనిమిగతా జర్నలిస్టులను ఎగదోయడం విభజించి పాలించడమే అవుతుంద‌ని ఆక్షేపించారు. ఈ కుటిలపన్నాగాలను తెలంగాణ సహించదని రాజగోపాల్‌రెడ్డి సంచ‌ల‌న ట్వీట్ చేశారు. బీసీ రిజ‌ర్వేష‌న్లు(BC Reservations), పార్టీ ఫిరాయింపులపై సుప్రీం తీర్పు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌తో పాటు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు రానున్న త‌రుణంలో ఇప్ప‌టికే రాష్ట్రంలో పొలిటిక‌ల్ హీట్ కొన‌సాగుతున్న త‌రుణంలో ఆయ‌న ట్వీట్ మ‌రింత అగ్గి రాజేసింది.

    READ ALSO  Fake Attendance | ఫేక్​ అటెండెన్స్​తో పంచాయతీ కార్యదర్శుల మోసం.. చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం

    Telangana Congress | సోష‌ల్ మీడియాపై సీఎం విమ‌ర్శ‌లు

    స్వయం ప్రకటిత జర్నలిస్టులపై ఇటీవ‌ల సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. న‌వ తెలంగాణ దిన‌ప‌త్రిక వార్షికోత్స‌వం(Nava Telangana Daily Anniversary Celebration)లో పాల్గొన్న ఆయ‌న‌.. ఏబీసీడీలు రానోడు కూడా తాను జ‌ర్న‌లిస్టున‌ని చెప్పుకుంటూ చెల‌రేగిపోతున్నార‌న్నారు. వీరిని కంట్రోల్ చేయ‌క‌పోతే రాజ‌కీయ నేత‌ల‌పై విశ్వాసం స‌న్న‌గిల్లిన‌ట్లే నిజ‌మైన జ‌ర్న‌లిస్టులపైనా ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం పోతుంద‌న్నారు. కొంద‌రు సోష‌ల్ మీడియా జ‌ర్న‌లిస్టులు చేసే అతి చూస్తుంటే వారిని చెంపదెబ్బ కొట్టాలని అనిపిస్తుంద‌ని, కానీ, హోదా, సంస్కారం అడ్డు వ‌చ్చి ఆగిపోతున్న‌ట్లు తెలిపారు. నిజమైన జర్నలిస్టులు మరియు సోషల్ మరియు డిజిటల్ మీడియా నుండి జర్నలిస్టుల మధ్య ఒక గీత గీయవలసిన అవసరం ఉంద‌న్నారు. సోష‌ల్ మీడియా జ‌ర్న‌లిస్టుల‌ను వేరు చేయాల‌ని, నిజమైన జర్నలిస్టులు, సోషల్ మీడియా జర్నలిస్టులు(Social Media Journalists) ఒకేలా ఉండరని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. తెలుగు అక్షరాలను కూడా సరిగ్గా చ‌ద‌వ‌లేని, రాయలేని వారు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా జర్నలిస్టులమ‌ని చెప్పుకుంటున్నారనిమండిప‌డ్డారు. వారిని అదుపు చేయకుండా వదిలేస్తే ఈ ధోరణి ప్ర‌జాస్వామ్యానికే ప్రమాదకరమ‌ని ఆందోళన వ్యక్తం చేశారు.

    READ ALSO  BC Reservations | బీసీ రిజ‌ర్వేష‌న్ల చుట్టూ రాజ‌కీయం.. హైద‌రాబాద్‌లో క‌విత‌.. ఢిల్లీకి కాంగ్రెస్ నేత‌లు..

    Telangana Congress | విభ‌జించి పాలించ‌డ‌మే..

    అయితే, ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న సొంత పార్టీ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి(MLA Komati Reddy) రాజ్‌గోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్ర‌ధాన మీడియా, సోష‌ల్ మీడియా జ‌ర్న‌లిస్టుల‌ను వేరు చేయ‌డ‌మంటే విభ‌జించి పాలించ‌డ‌మేన‌ని పేర్కొన్నారు. ఈ మేర‌కు సీఎం వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇస్తూ సంచ‌ల‌న పోస్టు చేశారు. “ప్ర‌జ‌ల కోసం నిజ‌మైన సామాజిక బాధ్య‌త ప‌ని చేస్తున్న సోష‌ల్ మీడియాను పాల‌కులు గౌర‌వించాలే త‌ప్ప ఇలా అవ‌మానించ‌డం స‌బ‌బు కాదు. తెలంగాణ స‌మాజ ఆకాంక్ష‌ల మేర‌కు మేర‌కు సోష‌ల్ మీడియా మొద‌టి నుంచి ప‌ని చేస్తూనే ఉంది. నిబ‌ద్ద‌త‌తో ప‌ని చేసే సోష‌ల్ మీడియా జ‌ర్న‌లిస్టుల‌కు నా మ‌ద్ద‌తు ఎప్పుడూ ఉంటుంది. సోష‌ల్ మీడియా జ‌ర్న‌లిస్టుల‌ను దూరం పెట్టాలంటూ ప్ర‌ధాన మీడియా జ‌ర్న‌లిస్టుల‌ను ఎగ‌దోయ‌డం ముమ్మాటికి విభ‌జించి పాల‌డించ‌మే ఇలాంటి కుటిల ప‌న్నాగాల‌ను తెలంగాణ స‌మాజాం స‌హించ‌దని” రాజ్‌గోపాల్‌రెడ్డి ట్వీట్ చేశారు.

    READ ALSO  Hyderabad | హైదరాబాద్​లో ట్రాఫిక్​ తిప్పలకు చెక్​.. త్వరలో డబుల్​ డెక్కర్​ ఫ్లైఓవర్​ నిర్మాణం

    Latest articles

    Torrential rain | దంచికొట్టిన వాన.. గంటలో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు..

    అక్షరటుడే, హైదరాబాద్: torrential rain పగలంతా ఉక్కపోతతో మహానగర metropoli ప్రజలు అల్లాడారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా...

    Critical Minerals | యువతకు గుడ్​ న్యూస్​.. రాష్ట్రానికి రెండు క్రిటికల్​ మినరల్స్ రీసెర్స్ సెంటర్స్ మంజూరు!

    అక్షరటుడే, హైదరాబాద్: Critical Minerals : తెలంగాణ (Telangana) విద్యా పొదిలో మరో రెండు కీలక పరిశోధన కేంద్రాలు...

    Collector Kamareddy | జుక్కల్​ సీహెచ్​సీ సూపరింటెండెంట్​, డ్యూటీ డాక్టర్​కు షోకాజ్​ నోటీసులు

    అక్షరటుడే, నిజాంసాగర్​: Collector Kamareddy | జిల్లాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల పట్ల కామారెడ్డి కలెక్టర్​ కొరడా జులిపిస్తున్నారు....

    CM Revanth | రాష్ట్రంలో భారీ వర్షాలు.. సీఎం రేవంత్​ కీలక ఆదేశాలు..

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : గ్రేటర్​ హైద‌రాబాద్‌ (Greater Hyderabad) తో పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు...

    More like this

    Torrential rain | దంచికొట్టిన వాన.. గంటలో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు..

    అక్షరటుడే, హైదరాబాద్: torrential rain పగలంతా ఉక్కపోతతో మహానగర metropoli ప్రజలు అల్లాడారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా...

    Critical Minerals | యువతకు గుడ్​ న్యూస్​.. రాష్ట్రానికి రెండు క్రిటికల్​ మినరల్స్ రీసెర్స్ సెంటర్స్ మంజూరు!

    అక్షరటుడే, హైదరాబాద్: Critical Minerals : తెలంగాణ (Telangana) విద్యా పొదిలో మరో రెండు కీలక పరిశోధన కేంద్రాలు...

    Collector Kamareddy | జుక్కల్​ సీహెచ్​సీ సూపరింటెండెంట్​, డ్యూటీ డాక్టర్​కు షోకాజ్​ నోటీసులు

    అక్షరటుడే, నిజాంసాగర్​: Collector Kamareddy | జిల్లాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల పట్ల కామారెడ్డి కలెక్టర్​ కొరడా జులిపిస్తున్నారు....