అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kollywood star hero Ajith | కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ (hero Ajith) డెడికేషన్‌కి కేరాఫ్ అడ్రెస్. సినిమాలతో పాటు రేసింగ్ విషయంలో ఆయన ఎంతో డెడికేషన్‌తో వర్క్ చేస్తారు.
అజిత్ కుమార్ రీసెంట్గా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీతో (good bad ugly movie) బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన మూవీస్ నుంచి రిటైర్ అవుతున్నారంటూ చర్చ సాగింది. ఈ క్రమంలో అజిత్.. నవంబర్‌లో తన తర్వాత మూవీ ప్రారంభం కానుందని.. వచ్చే ఏడాది సమ్మర్‌కు రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అలాగే.. రేసింగ్పైనా కీలక నిర్ణయం తీసుకున్నారు. మూవీస్, రేసింగ్ (movies and racing) ఈ రెండింటికీ సరైన న్యాయం చేయలేకపోతున్నానని తనకు అర్థమైందని అన్నారు. అందుకే.. రేసింగ్ సీజన్ (racing season) ఉన్న టైంలో మూవీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
Kollywood star hero Ajith | అంత వెయిట్ లాసా..
రేసింగ్ చేస్తున్న సమయంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయని , తన సినిమాల్లో తానే స్టంట్స్ Stunts చేస్తానని.. దాని వల్ల ఎన్నో సర్జరీలు సైతం జరిగాయని అన్నారు. సర్జరీలు జరిగాయని, అయినా యాక్షన్ సినిమాలు వదిలేయలేనంటూ అజిత్ స్పష్టం చేశారు. ఇక కార్ రేస్ ప్రాక్టీస్ (car race practice) చేస్తున్న అజిత్ ఫోటోలు, వీడియోలు (ajith photos and videos) వైరల్ అయ్యాయి. ఒక ఇంటర్వ్యూలో, రేసుల్లో పాల్గొనడానికి ఫిట్‌గా ఉండాలని నిర్ణయించుకుని, గత ఎనిమిది నెలల్లో 42 కిలోలు తగ్గినట్లు చెప్పారు. డైట్, స్విమ్మింగ్, సైక్లింగ్ (diet, swimming and cycling) వంటివి చేశానని, టీ, కాఫీ (tea and coffe) మానేసినట్లు తెలిపారు. రేసుల్లో పాల్గొనడానికి ఫిట్‌గా ఉండాలనేదే తన లక్ష్యం అని అజిత్ అన్నారు.
ఇటీవలే అజిత్ పద్మభూషణ్ అవార్డు (padmabhushan award) అందుకున్న విషయం తెలిసిందే. జనవరిలో జరిగిన 24 హెచ్ దుబాయ్ కార్ రేసింగ్‌లో (dubai car racing) ఆయన పాల్గొన్నారు. ఇందులో అజిత్ టీమ్ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక తాను మూవీస్ నుంచి ఎప్పుడు క్విట్ అవుతానో తనకే తెలియదని.. బలవంతంగానైనా మూవీస్ వీడాల్సి రావొచ్చని అన్నారు. తాను ఏ విషయాన్ని కూడా తేలికగా తీసుకోకూడదని అనుకుంటున్నానని.. ఆడియన్స్ తన యాక్టింగ్‌పై కూడా కంప్లైంట్ చేస్తారేమో తనకు తెలియదని చెప్పారు. ‘ఆడియన్స్‌లో (audience) నాకు ఎక్కువ క్రేజ్ ఉన్నప్పుడే నేను రిటైర్ అవుతానేమో. జీవితం చాలా విలువైనది. నేను జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. నా ఫ్రెండ్స్, రిలేటివ్స్ (friends and relatives) చాలా మంది జీవితాల్లో పోరాటాలు చేస్తున్న వారు ఉన్నారు..” అంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు అజిత్.