అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Model Arrest | బంగ్లాదేశ్ మోడల్ శాంత పాల్‌ను కోల్‌కతాలో (Kolkata) పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్‌కతా పోలీసుల యాంటీ-రౌడీ స్క్వాడ్ (Kolkata Police Anti-Rowdy Squad) ఆమెను అరెస్టు చేసింది. 28 ఏళ్ల శాంతపాల్ రీజెంట్ ఎయిర్‌వేస్ (బంగ్లాదేశ్) కంపెనీలో సిబ్బంది సభ్యురాలిగా పనిచేస్తోంది. అంతేగాకుండా ఆమె చిన్న మోడల్. కొన్ని నెలల క్రితం భారత్‌కు వచ్చిన ఆమె ఇక్కడే ఉండిపోయింది. అంతేగాకుండా నకిలీ ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు తీసుకోవడం గమనార్హం.
Model Arrest | మోసం కేసులో అరెస్ట్
కోల్‌కతా నగరంలోని బిక్రామ్‌గఢ్ (Bikramgarh) ప్రాంతంలో ఆమె నివసిస్తోంది. ఒక ఏజెంట్ ద్వారా ఆమె నకిలీ ఆధార్‌కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు తీసుకుంది. మోసం కేసుకు సంబంధించి దక్షిణ కోల్‌కతాలోని బిక్రామ్‌గఢ్ ప్రాంతంలో శాంత పాల్‌ను (Shanta Paul) అరెస్టు చేశారు. ఆమెపై మోసం, నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె దగ్గర రెండు నకిలీ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీ, రేషన్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Model Arrest | ఫ్లుడ్ వాగర్
ఫ్లుడ్ వాగర్ అయిన శాంతపాల్ విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసింది. అయితే బంగ్లాదేశ్ (Bangladesh) నుంచి చాలా దేశాలకు వెళ్లడానికి వీలు కాలేదు. దీంతో ఆమె భారత్‌లోకి ప్రవేశించి భారతీయురాలిగా ఇతర దేశాలకు వెళ్లాలని ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా ఆధార్, ఓటర్ కార్డులు (Voter Card) తీసుకుంది. స్థానికురాలిగా నటిస్తూ కార్ల అద్దె వ్యాపారం నిర్వహిస్తోంది. అంతేగాకుండా ఆమె తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసిన వీడియాల్లో తాను భారతీయురాలిని అని నిరూపించుకునే వ్యూహంలో భాగమని పోలీసులు తెలిపారు.
Model Arrest | ఆందోళన కలిగించే అంశం
బంగ్లాదేశ్‌కు చెందిన ఎంతో మంది అక్రమంగా భారత్‌లోకి ప్రవేశిస్తున్నారు. ఎంతోమంది నకిలీ ఓటర్ కార్డులు(Fake Aadhar Cards), ఆధార్ కార్డులు పొందారని బీజేపీ గత కొంతకాలంగా ఆరోపిస్తుంది. తాజాగా బంగ్లాదేశ్ మోడల్ వేర్వేరు అడ్రస్‌లతో రెండు నకిలీ ఆధార్ కార్డులు పొందడం వెలుగులోకి రావడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇలా ఎంత మంది వచ్చి అక్రమంగా ఉంటున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.