అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kokapet Lands | హైదరాబాద్ నగరంలో (Hyderabad City) భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యులు గజం భూమి కొనలేనంతగా రేట్లు పలుకుతున్నాయి. కోకాపేటలో భూముల ధరల (Land prices) రికార్డులు సృష్టిస్తున్నాయి.
రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలంలోని కోకాపేటలో గల నియోపొలిస్ లేఅవుట్ భూములకు హెచ్ఎండీఏ అధికారులు (HMDA officials) శుక్రవారం ఆన్లైన్ వేలంపాట నిర్వహించారు. ఇందులో అత్యధికంగా ఎకరం భూమి రూ.151.25 కోట్ల ధర పలకడం గమనార్హం. లే అవుట్‌లోని ప్లాట్ నంబర్ 15, 16లోని 9.06 ఎకరాలను ప్రభుత్వ తాజాగా వేలం వేసింది. ప్లాట్ నంబర్ 15లో ఎకరం రూ.151.25 కోట్లకు జీహెచ్ఆర్ సంస్థ దక్కించుకుంది. 16వ ప్లాట్లోని భూమిని ఎకరాకు రూ.147.75 కోట్లకు చొప్పున గోద్రెజ్ సంస్థ కొనుగోలు చేసింది. దీంతో ప్రభుత్వానికి రూ.1,353 కోట్ల ఆదాయం వచ్చింది.
Kokapet Lands | భారీగా ఆదాయం
ప్రభుత్వానికి భూముల వేలం (land auctions) ద్వారా భారీగా ఆదాయం సమకూరుతోంది. ఈ నెల 24న కోకాపేటలోని నియోపొలిస్‌లో ప్లాట్ నంబర్ 17, 18లోని భూములకు ప్రభుత్వం వేలం వేసింది. ప్లాట్ నం.17లోని భూమి ఎకరం ఏకంగా రూ.137.25 కోట్లు పలికింది. ప్లాట్ నెంబర్17లో 4.59 ఎకరాలు, 18లో 5.31 ఎకరాల భూమి ఉంది. మొత్తం 9.9 ఎకరాలకు 1,355.33 కోట్లు ధర పలికింది. డిసెంబర్ 3న మరోసారి వేలం పాట నిర్వహించనున్నారు. గోల్డెన్ మైల్‌లోని సైట్-2లో 1.98 ఎకరాలు, మూసాపేట్లో 3.18, 11.48 ఎకరాల్లోని రెండు సైట్లకు అధికారులు వేలం నిర్వహించనున్నారు. దీంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరనుంది.