Homeక్రీడలుVirat Kohli | టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్‌పై కోహ్లీ స‌ర‌దా కామెంట్స్.. గ‌డ్డానికి రంగు వేయ‌డమే...

Virat Kohli | టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్‌పై కోహ్లీ స‌ర‌దా కామెంట్స్.. గ‌డ్డానికి రంగు వేయ‌డమే సంకేతం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Virat Kohli | టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ తన టెస్ట్ రిటైర్మెంట్‌(Retirement)పై తొలిసారి స్పందించారు. మేలో టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆయన, దాదాపు రెండు నెలల తర్వాత ఈ నిర్ణయానికి గల కారణాన్ని సరదాగా వెల్లడించారు. లండన్‌లో యువరాజ్ సింగ్ నిర్వహించిన ‘యువికెన్ ఫౌండేషన్’ (Youviken Foundation) నిధుల సేకరణలో ఈ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కార్యక్రమంలో యువరాజ్ సింగ్, రవిశాస్త్రి, కెవిన్ పీటర్సన్ తదితర దిగ్గజాల సమక్షంలో వ్యాఖ్యాత గౌరవ్ కపూర్, వేదికపైకి రావాలని కోహ్లీని కోరారు.

Virat Kohli | స‌ర‌దా కామెంట్స్..

దీంతో విరాట్ సరదాగా స్పందిస్తూ.. “ఇప్పుడే గడ్డానికి రంగు వేసుకున్నా. ప్రతి నాలుగు రోజులకు ఒకసారి రంగు వేయాల్సి వస్తోంది అంటే ఆటకు గుడ్‌బై చెప్పే సమయం దగ్గరపడిందన్న మాట!” అంటూ చమత్కరించారు. కోహ్లీ మాటలు విన్నవారంతా హాస్యంలో మునిగిపోయారు. కోహ్లీ(Virat Kohli) టెస్ట్ కెరీర్ చూస్తే.. ఆయ‌న 123 టెస్టులు ఆడాడు. 9,230 పరుగులు (సగటు: 46.85) చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఆస్ట్రేలియా (Australia) గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిపించిన తొలి భారత కెప్టెన్ గా కోహ్లీ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు.

భారత టెస్ట్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న శుభ్‌మన్ గిల్‌(Shubman Gill)పై ప్రశంసలు కురిపించారు. ఇంగ్లండ్‌పై గిల్ చేసిన డబుల్ సెంచరీపై స్పందిస్తూ, “స్టార్ బాయ్!” అంటూ అభినందించారు. అలాగే యువరాజ్ సింగ్ తో తనకున్న ప్రత్యేక బంధాన్ని గుర్తుచేసుకున్నారు. జట్టులోకి వచ్చిన కొత్తలో యువీ, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. యువీతో నా అనుబంధం ఎప్పటికీ ప్రత్యేకమే అని అన్నారు. ఇక ఇదిలా ఉంటే రోహిత్ శర్మ టెస్టుల నుంచి తప్పుకున్న ఐదు రోజుల్లో కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించడం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇద్ద‌రు లెజెండ్స్ టెస్ట్ క్రికెట్, టీ 20ల నుండి త‌ప్పుకోవ‌డంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ‌లో ఉన్నారు. అయితే కోహ్లీ టెస్ట్ క్రికెట్‌(Test Cricket)కు వీడ్కోలు ప‌లికిన‌, అభిమానుల మనసుల్లో “కింగ్ కోహ్లీ”గా ఎప్పటికీ నిలిచిపోతారు.