Homeక్రీడలుVirat Kohli | విరాట్ కోహ్లీ ఫేవ‌రేట్ ఫుడ్ ఇదే.. ఎప్పుడైనా మీరు ట్రై చేశారా..!

Virat Kohli | విరాట్ కోహ్లీ ఫేవ‌రేట్ ఫుడ్ ఇదే.. ఎప్పుడైనా మీరు ట్రై చేశారా..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Virat Kohli | తాజాగా జ‌రిగిన ఐపీఎల్ సీజ‌న్‌లో ఆర్సీబీ జ‌ట్టు(RCB Team) క‌ప్ సాధించ‌డంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ముఖ్యంగా కోహ్లీ(Virat Kohli) ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేవు.

ఇన్నాళ్లు జ‌ట్టుతో ఉండి ఇప్ప‌టికీ కప్ అందించాడని సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఈ క్ర‌మంలోనే కోహ్లీ ఫుడ్‌కి సంబంధించిన వార్త‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఆయ‌న అంత ఫిట్‌గా ఉండ‌డం కోసం ఏ ఫుడ్ తీసుకుంటాడ‌నే చ‌ర్చ న‌డుస్తుంది. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యంత ఫిట్​గా ఉండే ఆటగాళ్లలో ఒకడు. అతడి ఫిట్‌ నెస్(Fitness)​కు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు. భారత క్రికెట్​లో ఫిట్‌ నెస్ రివల్యూషన్ తీసుకొచ్చింది కోహ్లీనే అంటే అతిశయోక్తి కాదు. మైదానంలో ఎలాంటి అలసట లేకుండా జింకలా పరుగులు తీస్తుంటే ఆశ్చర్యపోవాల్సిందే.

Virat Kohli | కోహ్లీ డైట్ సీక్రెట్..

సరైన ఆహారాన్ని తీసుకుంటేనే జిమ్ లో కష్టపడి పనిచేయొచ్చని విరాట్ అంటాడు. కానీ ఆహారాన్ని మార్చడం అంత ఈజీ విషయం కాదు. విరాట్ కోహ్లీ (Virat Kohli) మాత్రం ఫుడ్ విషయంలో చాలా నిబద్ధతగా ఉంటారట. విరాట్ కోహ్లీ ఎక్కువగా ఉడకబెట్టిన ఆహారాలను మాత్రమే తింటాడు. అయితే ఇతను అప్పుడప్పుడు కొద్దిగా ఆలివ్ ఆయిల్ (Olive oil) లేదా ఇతర మసాలా దినుసులతో చేసిన పాన్ గ్రిల్స్ వంటకాలను కూడా తింటాడట. వేయించిన లేదా వేడిగా ఉండే ఆహారాలకు కోహ్లీ దూరంగా ఉంటాడు. ఇతను సాధారణంగా రాజ్మా, పప్పు, లోబియా కూడా తింటాడు. విరాట్ కోహ్లీ మసాలా వంటకాలకు చాలా దూరంగా ఉంటాడు.

డైట్ లో ఎక్కువగా తాజా కూరగాయలను Vegetables చేర్చుతారు. ఇవి అతనికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి. అలాగే ఇది భోజనాన్ని సమతుల్యంగా ఉంచుతుంది. స్టీమ్ బాయిల్ అయిన ఫుడ్‌నే విరాట్ ఎక్కువ‌గా తీసుకుంటాడు. అస్స‌లు మ‌సాలాలు వాటికి త‌గ‌లనివ్వ‌డు. సాల్ట్(Salt), పెప్ప‌ర్(Pepper), లైమ్(Lemon) మాత్ర‌మే యాడ్ చేస్తాడ‌ట‌. టేస్ట్ గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోడ‌ట‌. స‌లాడ్స్ తాను ఎక్కువ‌గా ఎంజాయ్ చేస్తాన‌ని ఓ ఇంట‌ర్వ్యూలో తెలియజేశాడు కోహ్లీ. ఇప్పుడు కోహ్లీకి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుండ‌డంతో ఆయ‌న ఫ్యాన్స్ కూడా ఇప్పుడు కోహ్లీ ఫుడ్ ట్రై చేయాల‌ని అనుకుంటున్నారట‌