అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kodangal Congress Clean Sweep | మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం భారీ మున్సిపాలిటీలను ఆ పార్టీ కైవసం చేసుకుంది.
సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సొంత నియోజకవర్గమైన కొడంగల్ (Kodangal)లో కాంగ్రెస్ సత్తా చాటింది. నియోజకవర్గంలో మూడు మున్సిపాలిటీలు ఉండగా.. అన్నింట్లో కాంగ్రెస్ అభ్యర్థులు మెజారిటీ సాధించారు. దీంతో మున్సిపల్ పీఠాలు హస్తగతం అయ్యాయి. వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 1, ఎంఐఎం 1 స్థానాల్లో గెలుపొందాయి. నారాయణపేట జిల్లా మద్దూరు మున్సిపాలిటీలో 16 వార్డులు ఉండగా.. కాంగ్రెస్ 9 చోట్ల గెలుపొంది బల్దియా పీఠాన్ని దక్కించుకుంది. బీఆర్ఎస్ 06, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక చోట విజయం సాధించారు. కోస్గిలో 16 వార్డులు ఉండగా.. ఇప్పటికే కాంగ్రెస్ 8 వార్డుల్లో గెలిచింది. బీఆర్ఎస్, బీజేపీ ఇంకా ఖాతా తెరవలేదు. మిగతావార్డుల్లో కౌంటింగ్ కొనసాగుతోంది.
Kodangal Congress Clean Sweep | చేర్యాలలో బీఆర్ఎస్ విజయం
సిద్దిపేట జిల్లా (Siddipet District) చేర్యాల మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.మొత్తం 12వార్డులకు గాను బీఆర్ఎస్ 7 వార్డుల్లో, కాంగ్రెస్ 5 వార్డుల్లో గెలుపొందాయి. దుబ్బాక మున్సిపాలిటీలో సైతం గులాబీ పార్టీ విజయం సాధించింది. మరోవైపు గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ (Vaddepalli Municipality)ని ఫార్వార్డ్ బ్లాక్ గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే ఫార్వార్డ్ బ్లాక్‌కు కవిత మద్దతు తెలిపిందని వార్తలు వచ్చాయి. అయితే అక్కడ బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులు గెలుపొందారు. తమకు కవితతో సంబంధం లేదని రెబల్ అభ్యర్థి వడ్డేపల్లి శ్రీనివాస్ తెలిపారు. తమ వర్గానికి టికెట్లు ఇవ్వకపోవడంతో ఫార్వార్డ్ బ్లాక్ తరఫున పోటీ చేశామన్నారు.