ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Kodali nani | కొడాలి నాని ఆరోగ్యం ఎలా ఉంది.. అత్య‌వ‌సరంగా అమెరికాకు..!

    Kodali nani | కొడాలి నాని ఆరోగ్యం ఎలా ఉంది.. అత్య‌వ‌సరంగా అమెరికాకు..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Kodali nani | మాజీ మంత్రి కొడాలి నాని (former minister kodali nani) ఏపీ ఫైర్ బ్రాండ్‌గా రాజకీయాల‌ని శాసించాడు. వైసీపీ (YCP) అధికారంలో ఉన్న‌ప్పుడు కొడాలి నాని హ‌వా ఎలా ఉండేదో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. నాని ఎప్పుడు ప్రెస్ మీట్ (press meet) పెట్టినా.. ఎక్కడ మాట్లాడినా చంద్రబాబు (chandra babu), ఆయన కుమారుడు నారా లోకేశ్ (nara lokesh), జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై (pawan kalyan) బూతుల దండకం అందుకుంటూ వార్త‌ల‌లో నిలిచేవారు. అసభ్య పదజాలంతో.. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తూ అదేదో గొప్ప విషయం అన్నట్లుగా భావించే వారు. అయితే కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఎప్పుడైతే ఆయన మిత్రుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (gannavaram former MLA vallabaneni vamshi) అరెస్టయ్యారో.. అప్పటి నుంచీ కొడాలి నానిలో ఫైర్ పూర్తిగా ఆరిపోయింది. అరెస్టు భయం వెన్నాడుతూ వ‌చ్చింది. ఇక కొంత కాలం కిందట ఛాతి నొప్పితో హైదరాబాద్ లోని (hyderabad) ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు నాని.

    Kodali nani | అమెరికాకు నాని..

    అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం అంటూ ముంబైకి (mumbai) వెళ్లారు. అక్కడ ఆయనకు ఆపరేషన్ జరిగిందని చెప్పారు. అయితే కొడాలి నాని (kodali nani) హెల్త్ బులిటిన్ ను ముంబై ఆస్పత్రి విడుదల చేయలేదు కానీ, ఆపరేషన్ విజయవంతమైందనీ, కొడాలి నాని కొలుకుంటున్నారనీ గుడివాడకు (gudivada) చెందిన వైసీపీ నాయకుడొకరు మీడియాకు తెలిపారు. ఈ మ‌ధ్య నాని ఆరోగ్య పరిస్థితి గురించి కానీ, ఆయన ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? వంటి విషయాలేవీ బయటకు తెలియడం లేదు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో (hyderabad) విశ్రాంతి తీసుకుంటున్నారు. మెరుగైన చికిత్స కోసం వైద్యుల (doctors) సలహా మేరకు అమెరికా (america) వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పార్టీ నేతలు తెలిపారు.

    హైదరాబాద్(Hyderabad)లో నానికి వైద్య పరీక్షలు (medical tests) చేసిన సమయంలో గుండెలో మూడు రక్త నాళాలు పూడుకుపోయినట్లు గుర్తించారు. బైపాస్ అవసరమని నిర్ధారించటంతో ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించారు. అక్కడ ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ లో 8 గంటల పాటు బైపాస్ సర్జరీ నిర్వహించారు. సర్జరీ తరువాత పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఆ తరువాత నాని కోలుకోవటంతో హైదరాబాద్ (hyderabad) వచ్చేసారు. సర్జరీ తరువాత వైద్యుల సూచన మేరకు ఎవరినీ కలవడం లేదు. సర్జరీ (surgery) తరువాత కొంత కాలం ఆగి వెళ్లాలనే వైద్యుల సూచన మేరకు ఇప్పుడు ప్రణాళికలు సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. నాని కోలుకున్నా.. కొంత కాలంగా పూర్తిగా రాజ కీయాలకు (politics) దూరంగా ఉండాల్సిందేనని చెబుతున్నారు. కాగా, నాని తిరిగి ఆరోగ్యంగా రావాలని ఆయన అభిమానులు.. పార్టీ కేడర్ పూజలు చేసింది. ప్రస్తుతం నాని కోలుకున్నారు. మరింత మెరుగైన చికిత్సతో పాటుగా విశ్రాంతి కోసం అమెరికా వెళ్తున్నట్లు తెలుస్తోంది.

    Latest articles

    Today Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    Today Panchangam : తేదీ(DATE) – 16 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama...

    Rajagopal Reddy | మరోసారి సీఎం రేవంత్​ను టార్గెట్ చేసిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్!

    అక్షరటుడే, హైదరాబాద్: Rajagopal Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్...

    Heavy rain in Hyderabad | హైదరాబాద్​లో దంచికొడుతున్న వాన.. ఆ ప్రాంతాల్లో కుంభవృష్టి

    అక్షరటుడే, హైదరాబాద్: Heavy rain in Hyderabad : బుధ, గురువారాల్లో భారీ వర్షాలు (Heavy Rain) ఉంటాయని...

    alcohol with volcanic ash | అగ్నిపర్వతాల బూడిదతో మద్యం తయారీ.. తాగారా దీనిని..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: alcohol with volcanic ash : అంతర్జాతీయ బ్రాండ్​ ఆల్కహాల్​ (international brand alcohol) కోసం...

    More like this

    Today Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    Today Panchangam : తేదీ(DATE) – 16 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama...

    Rajagopal Reddy | మరోసారి సీఎం రేవంత్​ను టార్గెట్ చేసిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్!

    అక్షరటుడే, హైదరాబాద్: Rajagopal Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్...

    Heavy rain in Hyderabad | హైదరాబాద్​లో దంచికొడుతున్న వాన.. ఆ ప్రాంతాల్లో కుంభవృష్టి

    అక్షరటుడే, హైదరాబాద్: Heavy rain in Hyderabad : బుధ, గురువారాల్లో భారీ వర్షాలు (Heavy Rain) ఉంటాయని...