అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KL Rahul | క్రికెట్ మైదానంలో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకునే భారత స్టార్ ప్లేయర్ కేఎల్.రాహుల్ ఇప్పుడు కాంతార చాప్టర్ 1 సినిమా చూసి ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశమైంది.
రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన “కాంతారా చాప్టర్ 1″(Kantara Chapter 1) సినిమాను చూసిన అనంతరం, రాహుల్ తన సోషల్ మీడియా వేదికగా సినిమా గురించి ప్రత్యేకంగా రాసుకొచ్చాడు. ఈ మ్యాజిక్ చూసి మైండ్ బ్లాక్ అయ్యింది. రిషబ్ శెట్టి (Rishab Shetty) మరోసారి అద్భుతాన్ని సృష్టించారు. ఈ సినిమా మంగళూరుకు చెందిన ప్రజలను ఎంతో ప్రతిబింబిస్తుంది” అంటూ ట్వీట్ చేసిన రాహుల్, తన అభిమానాన్ని చాటుకున్నారు.
KL Rahul | ఫిదా అయిన క్రికెటర్
కర్ణాటకకు (Karnataka) చెందిన రాహుల్‌కు ఈ ప్రాంతంతో ప్రత్యేక అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. రిషబ్ శెట్టి తీసిన “కాంతారా: చాప్టర్ 1” ప్రాంతీయ సంస్కృతి, నమ్మకాల నేపథ్యంతో తెరకెక్కిన సినిమా. అందుకే ఈ సినిమా రాహుల్‌కి మరింతగా కనెక్ట్ అయింది. రాహుల్ ట్వీట్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. అభిమానులు అతనికి సినిమాపై ఉన్న చిత్తశుద్ధిని మెచ్చుకుంటున్నారు. కేవలం కర్ణాటక ప్లేయర్ అని కాకుండా, నచ్చిన సినిమా ఏ భాషలో వచ్చినా కూడా ప్రశంసించడం మంచి విషయం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో చాలామంది క్రికెటర్లు తమకు నచ్చిన సినిమాలను సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూ కనిపిస్తున్నారు. “పుష్ప” సినిమాలో “తగ్గేదేలే” మేనరిజం అనేకమంది క్రికెటర్లు గ్రౌండ్‌లో అనుకరించిన దాఖలాలు గుర్తుండే ఉంటాయి.
సినిమాల నుంచి వచ్చే జోష్.. క్రికెటర్లలోనూ ఎనర్జీగా మారుతుందని భావిస్తున్నారు. ఇప్పుడు రాహుల్ కామెంట్స్‌తో మరికొంతమంది ప్లేయర్లు కూడా కాంతారా చాప్టర్ 1 చూసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం, కేవలం కమర్షియల్‌గానే కాదు, ప్రాంతీయ కళలను, భావాల కలబోతగా ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. అజనీష్ లోకనాథ్ సంగీతం, సినిమాకు మరింత బలం కలిగించింది. విజువల్స్, నటన, నేపథ్య సంగీతం అన్నీ కలిసి ఓ విజువల్ స్పెక్టాకిల్‌లా మారింది.