ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMla KVR | వరద బాధితులకు కిట్ల అందజేత

    Mla KVR | వరద బాధితులకు కిట్ల అందజేత

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Mla KVR | కామారెడ్డి పట్టణంలో (kamareddy) ఇటీవల వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. పట్టణంలోని జీఆర్ (GR Colony), కౌండిన్య, హౌసింగ్ బోర్దు కాలనీలు నీట మునిగాయి. బతుకమ్మ కుంట, రుక్మిణి కుంట, ఇతర లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

    దీంతో వరద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని భారత్ సేవాశ్రమ సంఘం (Bharat Seva Shram Sangh) సభ్యులకు ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సూచించారు. ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు బుధవారం పట్టణంలోని వరద బాధిత కుటుంబాలకు రూ. 25 లక్షల విలువ చేసే కిట్లను పంపిణీ చేశారు. ఈ కిట్​లో చీర, లుంగీ, బిస్కెట్ ప్యాకెట్, బ్లాంకెట్, టీ షర్ట్ ఉంటాయని భారత్ సేవాశ్రమ సంఘం ప్రతినిధులు తెలిపారు.

    Mla KVR | బాలవికాస – అమెజాన్ ఆధ్వర్యంలో..

    వరద బాధితులకు అండగా నిలవాలని ఎమ్మెల్యే సూచన మేరకు బాలవికాస – అమెజాన్ (Bala vikasa- Amazon) సంస్థలు ముందుకు వచ్చాయి. కామారెడ్డి పట్టణంలోనీ ఆర్​బీ​ నగర్ కాలనీలో గతవారం వచ్చిన వరదల సందర్భంగా పేదల కోసం ఒక్కో ఇంటికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. పట్టణంలోని బాధిత కుటుంబాలకు 6 లక్షల విలువ చేసే 400 కిట్లు బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు.

    Mla KVR | జైన్​ సమాజ్​ – మార్వాడీ సమాజ్​ ఆధ్వర్యంలో..

    జైన్ సమాజ్ – మార్వాడీ సమాజ్ (Jain Samaj-Marwadi Samaj) ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను వరద బాధిత కుటుంబాలకు అందజేశారు. పట్టణంలోనీ రుక్మిణి నగర్ కాలనీలో గతవారం వచ్చిన వరదల సందర్భంగా పేదల కోసం ఒక్కో ఇంటికి నెలకు సరిపడా నిత్యావసర సరుకుల రూ. 3లక్షల విలువ గల 200 కిట్లు బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు.

    More like this

    Maggari Hanmandlu | బీఆర్​ఎస్​కు షాక్​.. పార్టీకి సొసైటీ ఛైర్మన్​ రాజీనామా

    అక్షరటుడే, బోధన్​: Maggari Hanmandlu | జిల్లాలో బీఆర్​ఎస్ (Brs Nizamabad)​ పార్టీలో తొలి రాజీనామా నమోదైంది.  కేసీఆర్​...

    Nepal PM Resigns | నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal PM Resigns | నేపాల్​ ప్రధాని కేపీ శర్మ ఓలి తన పదవికి...

    Best Teacher Award | నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలి

    అక్షరటుడే, ఇందూరు : Best Teacher Award | విద్యార్థులకు కేవలం మార్కులు, ర్యాంకుల చదువులు కాకుండా.. నైతిక...