అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jubilee Hills by-Election | | కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో ఘోర పరాభవమే మిగిలింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (Jubilee Hills by-election) బీజేపీ భారీ ఓటమిని మూటగట్టుకుంది.
కనీసం పోటీలో కూడా లేకుండా పోవడానికి కిషన్‌రెడ్డి వ్యవహార శైలే కారణమన్న ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో కాషాయ పార్టీకి పెద్ద దిక్కుగా భావించే కిషన్‌రెడ్డి తాజా ఉప ఎన్నికను పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదన్న విమర్శలు మొదటి నుంచి వెల్లువెత్తాయి. అందుకు అనుగుణంగానే ఆయన వ్యవహార శైలి కనిపించింది. కేసీఆర్‌తో మైత్రి కారణంగా బీఆర్ఎస్(BRS)ను గెలిపించేందుకే ఆయన అంటీముట్టనట్లుగా వ్యవహరించారన్న భావన వ్యక్తమైంది. ఇదే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ (Congress party) తన ప్రచారంలో పదే పదే లేవనెత్తింది.
Jubilee Hills by-Election | | సీరియస్‌గా తీసుకోని వైనం..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ బొక్కబోర్లా పడడానికి ప్రధాన కారణం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డియేనన్న అపవాదును మూటగట్టుకున్నారు. అభ్యర్థి ఎంపిక మొదలు ప్రచారం వరకూ ఆయన పెద్దగా ఆసక్తి చూపించక పోవడంతో బీజేపీ కనీస పోటీ కూడా ఇవ్వకుండా చేతులెత్తేసింది. సభలు, సమావేశాలు కూడా ఏర్పాటు చేయకుండా ఇంటింటి ప్రచారం మాత్రమే నిర్వహించారు. అది కూడా అంతంత మాత్రంగానే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా పార్టీ నేతలను సమన్వయం చేసుకుని ముందుకు సాగలేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ కారణంగానే ప్రచారానికి ముఖ్య నాయకులు ఎవరూ రాలేదనే చర్చ సాగింది.
బీహార్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (BJP-led NDA) హవా కొనసాగిస్తే తెలంగాణలో జరిగిన ఏకైక ఉప ఎన్నికలో కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. తాజా ఓటమికి కిషన్‌రెడ్డి కారణమన్న భావన పార్టీ శ్రేణుల్లోనూ వ్యక్తమవుతోంది. ఎన్నికలకు ముందే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Goshamahal MLA Raja Singh) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ‘కిషన్‌రెడ్డి గారు.. ఈ ఎన్నికలో ఎవరిని గెలిపిస్తున్నారని’ రాజాసింగ్ బహిరంగంగానే విమర్శించారు. బీఆర్ఎస్కు అనుకూలంగా కేంద్ర మంత్రి వ్యవహరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Jubilee Hills by-Election | పోటీ కూడా ఇవ్వని బీజేపీ..
పార్లమెంట్ ఎన్నికల్లో (parliamentary elections) అనూహ్యంగా ఎనిమిది ఎంపీ సీట్లను గెలుచుకోవడం, ఎమ్మెల్సీ ఎలక్షన్లలోనూ సత్తా చాటడంతో బీజేపీలో కొత్త ఉత్సాహం నెలకొంది. అయితే, స్థానిక సంస్థల ఎన్నికల ముందు జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాత్రం కనీస పోరాటం చేయకుండా చేతులెత్తేసింది. గతంలో జరిగిన హుజురాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో సంచలన విజయాలు సాధించిన కాషాయ దళం.. తాజా ఉప ఎన్నికలో కాడి వదిలేసింది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పట్టించుకోక పోవడం వల్లే జూబ్లీహిల్స్‌లో ఓటమి తప్పలేదన్న ప్రచారం జరుగుతోంది. సొంత నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికను కిషన్‌రెడ్డి లైట్‌గా తీసుకున్నారన్న ప్రచారం జరిగింది.
