అక్షరటుడే, వెబ్‌డెస్క్ : GHMC | జీహెచ్‌ఎంసీ బీజేపీ (BJP) కార్పొరేటర్లతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) మంగళవారం సమావేశం అయ్యారు.
బుధవారం బల్దియా సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్పొరేటర్లకు కిషన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇటీవల బీజేపీ నేతలు బస్తీ పర్యటనలు చేపట్టారు. ఈ పర్యటనల్లో వచ్చిన సమస్యలను జీహెచ్‌ఎంసీ(GHMC) కౌన్సిల్ సమావేశం (Council Meetin)లో లేవనెత్తాలని ఆయన సూచించారు.
వర్షాకాలం సన్నద్ధతపై ప్రశ్నించాలని ఆదేశించారు. గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాద ఘటనపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాలని కార్పొరేటర్లకు సూచించారు. ఇటీవల పాతబస్తీలోని మీర్చౌక్లో గల గుల్జార్‌హౌస్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. అధికారుల నిర్లక్ష్యంతోనే తమ వారు మృతి చెందారని ఆరోపించారు. ఈ క్రమంలో ఈ అంశాన్ని మీటింగ్‌లో లేవనెత్తాలని కిషన్ రెడ్డి సూచించారు.