అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kishan Reddy on BRS | మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ చతికిలపడిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) అన్నారు. ఇచ్చినా హామీలు అమలు చేయని కాంగ్రెస్‌పై ప్రజా తీర్పు స్పష్టంగా కన్పిస్తోందన్నారు.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై శనివారం కిషన్‌రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో బీజేపీ ఒక నమ్మకమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోంది అనడానికి ఈ పలితాలు నిదర్శనం అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార గర్వంతో ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా పోరాడి విజయం సాధించిన బీజేపీ (BJP) అభ్యర్థులందరికీ ఆయన అభినందనలు తెలిపారు. రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగం చేస్తూ.. రూ.వందల కోట్లు ఖర్చు చేసినా.. వేధింపులకు గురి చేసినా.. భారతీయ జనతా పార్టీ అద్భుత ప్రదర్శన కనబరిచిందన్నారు.
Kishan Reddy on BRS | రెట్టించిన ఉత్సాహంతో..
కరీంనగర్ (Karimnagar) మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. నిజామాబాద్ కార్పొరేషన్లో అతిపెద్ద పార్టీగా అవతరించామని చెప్పారు. ఏడు మున్సిపాలిటీల్లో అతిపెద్ద పార్టీగా (Single Largest Party) నిలిచామని, 261 వార్డుల్లో విజయం సాధించామని వెల్లడించారు. తెలంగాణ పట్టణ ప్రాంతాల్లో పార్టీ ప్రాబల్యాన్ని విస్తరించిందని చెప్పారు. ఓటమి చెందిన పార్టీ అభ్యర్థులు నిరుత్సాహపడొద్దని ఆయన సూచించారు. రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగాలన్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు.