Homeతాజావార్తలుPonnam Prabhakar | బీఆర్​ఎస్​ మౌత్​పీస్​గా కిషన్​రెడ్డి.. మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు

Ponnam Prabhakar | బీఆర్​ఎస్​ మౌత్​పీస్​గా కిషన్​రెడ్డి.. మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు

యూసుఫ్​గూడ డివిజన్​లో మంత్రులు పొన్నం ప్రభాకర్​, ఉత్తమ్​ కుమార్​ రెడ్డి గురువారం ప్రచారం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్​ యాదవ్​ను గెలిపించాలని కోరారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ponnam Prabhakar | జూబ్లీహిల్స్​ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్​ దూసుకుపోతుంది. మంత్రులు నియోజకవర్గంలోని డివిజన్లలో పర్యటిస్తున్నారు. తమ అభ్యర్థి నవీన్​ యాదవ్​ను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు.

యూసుఫ్​గూడ డివిజన్​లో మంత్రులు పొన్నం ప్రభాకర్​, ఉత్తమ్​ కుమార్​ రెడ్డి (Uttam Kumar Reddy) గురువారం ఉదయం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల కోసం కిషన్ రెడ్డి (Kishan Reddy), కేసీఆర్ (KCR) కలిసి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. 12 ఏళ్లుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కేంద్రం నుంచి ఏం తెచ్చారో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. ఆయన పార్లమెంట్​ నియోజకవర్గం పరిధిలో ఉన్న జూబ్లీహిల్స్​ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ గత పదేళ్లలో జూబ్లీహిల్స్​కి ఏం చేసిందో చెప్పాలన్నారు.

Ponnam Prabhakar | కాంగ్రెస్​పై కుట్రలు

కిషన్​ రెడ్డి బీఆర్​ఎస్​ పార్టీ (BRS Party) మౌత్​పీస్​గా మారారని పొన్నం ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు తాను అనడం లేదని, గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్ (Goshamahal MLA Raja Singh) అంటున్నారని చెప్పారు. మొత్తంగా బీజేపీని తీసుకుపోయి బీఆర్​ఎస్​కు అప్పగించారని విమర్శించారు. కాంగ్రెస్​పై గెలవలేక బీఆర్​ఎస్​, బీజేపీ కలిసి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక కొత్త రేషన్​ కార్డులు ఇచ్చామన్నారు. పేదలకు రేషన్​ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. నవీన్​ యాదవ్​ను గెలిపించాలని కోరారు. జూబ్లీహిల్స్​ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

ప్రచారంలో భాగంగా శ్రీ కృష్ణనగర్​లో మంత్రి పొన్నం ప్రభాకర్​ (Ponnam Prabhakar) దోశ వేశారు. ఈ రోజు తమ అభ్యర్థిని రౌడీ అని ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. పదేళ్ల పాలనలో బీఆర్​ఎస్​ నాయకులు నియంతృత్వంగా ప్రజలను అణచివేశారన్నారు. చదువుకున్న నవీన్​యాదవ్​ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో అజారుద్దీన్​, మాజీ ఎమ్మెల్యే సంపత్​ తదితరులు పాల్గొన్నారు.