Kingdom | కింగ్​డమ్​ ట్రైలర్​ రిలీజ్​.. ఇరగదీసిన విజయ్​ దేవరకొండ
Kingdom | కింగ్​డమ్​ ట్రైలర్​ రిలీజ్​.. ఇరగదీసిన విజయ్​ దేవరకొండ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kingdom : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం కింగ్ డమ్. జులై 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గౌతమ్ తిన్ననూరి Gautham Tinnanuri దర్శకత్వం వహించారు. ఈయన గతంలో మళ్ళీ రావా, జెర్సీ లాంటి క్లాసిక్ సినిమాలు తెరకెక్కించారు. దీంతో తాజా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Kingdom : యాక్షన్​ కోణం..

కింగ్​డమ్​ మూవీ Kingdom movie ని పూర్తిగా యాక్షన్ కోణంలో తెరకెక్కించారు. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ను ఇంతవరకు చూడని కోణంలో చూపించారు. ప్రేమ, కుటుంబ కథా చిత్రాలతో ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ తాజాగా.. యాక్షన్​ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రంలో ఎమోషన్స్ కూడా గుండెకు హత్తుకునేలా ఉండబోతున్నాయని టాక్​.

Kingdom : కీలక పాత్రలో సత్యదేవ్​..

నటుడు సత్యదేవ్ Actor Satyadev కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. విజయ్ దేవరకొండకు జతగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 31న థియేటర్​లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో తాజాగా కింగ్​డమ్​ ట్రైలర్​ను రిలీజ్​ చేశారు.

ప్రస్తుతం కింగ్​డమ్​ ట్రైలర్​ హల్​చల్​ చేస్తోంది. ట్రైలర్​లో విజయ్ దేవరకొండ లుక్​ అదిరిపోయిందని ప్రేక్షకులు అంటున్నారు. కాగా, ఇప్పటికే రిలీజ్​ అయిన కింగ్​డమ్​ టీజర్​ అభిమానులను మెప్పించింది.