అక్షరటుడే, వెబ్డెస్క్ : Kingdom First Day Collections | రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం కింగ్‌డమ్. జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం(Director Gautham Tinnanuri)లో తెరకెక్కిన కింగ్‌డమ్ సినిమా జూలై 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల(Fortune Four Cinemas Banners)పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో వచ్చిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ భోర్సే(Heroine Bhagyashree Bhorse), సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను దాదాపు ₹130 కోట్లు బడ్జెట్‌తో నిర్మించారు. ముఖ్యమైన సన్నివేశాలను శ్రీలంక జాఫ్నా జైలులో షూట్ చేయడం విశేషం. నటీనటులు, సాంకేతిక బృందానికి రెమ్యూనరేషన్‌తో పాటు ప్రమోషన్ల ఖర్చులతో భారీగా పెట్టుబడి ఖర్చు చేశారు.
Kingdom First Day Collections | మంచి ఓపెనింగ్..
మూవీ ప్రీ-రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాం ₹15 కోట్లు, సీడెడ్ ₹6 కోట్లు, ఆంధ్రా థియేట్రికల్ ₹15 కోట్లు, మొత్తం: ₹36 కోట్లు అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్: ₹37 కోట్లు. పాజిటివ్ టాక్ తో ఈ సినిమా ఫస్ట్ డేనే మంచి ఓపెనింగ్స్ సాధించింది. నైజాం: ₹4.20 కోట్లు, సీడెడ్: ₹1.70 కోట్లు, ఉత్తరాంధ్ర: ₹1.16 కోట్లు, గుంటూరు: ₹0.75 కోట్లు, తూర్పు గోదావరి: ₹0.74 కోట్లు, కృష్ణా: ₹0.59 కోట్లు, పశ్చిమ గోదావరి: ₹0.44 కోట్లు, నెల్లూరు: ₹0.34 కోట్లు.మొత్తంగా తొలి రోజు (ఏపీ& తెలంగాణ- జీఎస్టీ లేకుండా నెట్ కలెక్షన్స్)- ₹9.92 కోట్లు రాబట్టినట్టు తెలుస్తుంది. అంటే తొలి రోజే సుమారుగా 40% రికవరీ సాధించింది అని నిర్మాత నాగవంశీ తెలిపారు.
కింగ్డమ్ ఓవర్సీస్‌లోనూ సాలిడ్ ఓపెనింగ్స్ అందుకుంది. యూఎస్ఏ, ఆస్ట్రేలియా కలిపి $1 మిలియన్ డాలర్లకు పైగా రాబట్టినట్టు తెలుస్తుంది. కేరళలో గ్రాస్ కలెక్షన్: ₹50 లక్షలు వసూలు చేసింది. తొలి రోజు నుంచే హౌస్‌ఫుల్ బుకింగ్స్ కావడంతో ఫస్ట్ వీక్ లో బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఉన్నాయి. అలానే ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు అందే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తంగా ‘కింగ్డమ్’(Kingdom) బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. విజయ్ దేవరకొండ(Vijay Devara Konda) నటన, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం, టెక్నికల్ స్టాండర్డ్స్ అన్ని ఈ సినిమా హిట్ కావడంలో భాగం అయ్యాయి. రానున్న రోజులలో ఈ సినిమా ఇంకా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సిందే!