అక్షరటుడే, కామారెడ్డి:Human Rights Committee Kamareddy | టూరిస్టు(Tourist)లను హతమార్చడమంటే మానవ హక్కులను భంగం కలిగించినట్లేనని జాతీయ మానవ హక్కుల కమిటీ కామారెడ్డి జిల్లా కమిటీ పేర్కొంది. గురువారం ఆర్అంబ్బీ గెస్ట్‌హౌస్(R&B Guesthouse)లో విలేకరులతో కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కమిటీ జిల్లా ఛైర్మన్ విజయ భాస్కరరావు, జిల్లా సహాయ కార్యదర్శి కటికం రాజిరెడ్డి మాట్లాడుతూ.. కొద్ది రోజుల క్రితం పహల్గామ్(Pahalgam)లో భారతీయులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఉగ్రవాదం(Terrorists)పై భారత్ ఉక్కుపాదం మోపాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్హెచ్ఆర్సీ జిల్లా కన్వీనర్ రవీందర్ రెడ్డి, జిల్లా మీడియా ఇన్‌ఛార్జి సంకి నారాయణ, రాజంపేట మండల ఛైర్మన్ నాగభూషణం, పాల్వంచ మండల ఛైర్మన్ అంబాల రవి పేర్కొన్నారు.
Home జిల్లాలు కామారెడ్డి Human Rights Committee Kamareddy | టూరిస్టులను హతమార్చడం.. మానవహక్కులను భంగం కలిగించడమే..