Homeక్రీడలుKieron Pollard | పొలార్డ్​ విధ్వంసం.. 8 బంతుల్లో 7 సిక్సర్లతో ఊచ‌కోత‌

Kieron Pollard | పొలార్డ్​ విధ్వంసం.. 8 బంతుల్లో 7 సిక్సర్లతో ఊచ‌కోత‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kieron Pollard | కొంద‌రు బ్యాట‌ర్లు రిటైర్ అయ్యాక మ‌రింత రాటుదేలుతున్నారు. సిక్స‌ర్ల వ‌ర్షం కురిపిస్తూ బౌల‌ర్స్‌కి చుక్క‌లు చూపిస్తున్నారు. ఆ మ‌ధ్య డివిలియర్స్ ఎలాంటి ఇన్నింగ్స్ లు ఆడాడో మ‌నం చూశాం. ఇక ఇప్పుడు పొలార్డ్ టైం వ‌చ్చింది.

విధ్వంస‌క‌ర ఆట‌తో అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయేలా చేశాడు పొలార్డ్​. కరేబియన్ ప్రీమియర్ లీగ్ (Caribbean Premier League) 2025లో ట్రినిబాగో నైట్ రైడర్స్ (TKR) తరఫున ఆడుతున్న కిరాన్ పొలార్డ్ మరోసారి తన విధ్వంసకర ఆటతో హాట్ టాపిక్ అయ్యాడు. సోమవారం మ్యాచ్​లో పొలార్డ్ 29 బంతుల్లో 65 పరుగులు చేయడం విశేషం. 8 సిక్సర్లు, 2 ఫోర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు.

Kieron Pollard | పొలార్డ్ షో..

ఇన్నింగ్స్ ప్రారంభంలో కొంత నెమ్మదిగా ఆడిన పొలార్డ్ (Kieron Pollard), ఒక్కసారి కుదురుకున్న తర్వాత మాత్రం గేర్ మార్చాడు. 15వ ఓవర్‌లో నవీన్ బిడేసి బౌలింగ్‌లో 3 సిక్స్‌లు, 16వ ఓవర్‌లో అఫ్గాన్ బౌలర్ వకార్ సలాంఖైల్‌పై వరుసగా 4 సిక్స్‌లు కొట్టాడు. చివరి 8 బంతుల్లో 7 సిక్స్‌లు బాదడం  విశేషం. నికోలస్​ పూరన్​ సైతం 38 బంతుల్లో 52 పరుగులు చేయడంతో  ట్రినిబాగో నైట్ రైడర్స్ (TKR) 179/6 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కి దిగిన ఎస్‌కేఎన్ పాట్రియట్స్ నిర్ణిత ఓవర్లలో 167/8 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. దీంతో టీకేఆర్ విజ‌యం సాధించింది.

ఎస్‌కేఎన్ పాట్రియట్స్ జ‌ట్టులో ఆండ్రే ఫ్లెచర్ 54 బంతుల్లో 67 పరుగులతో రాణించాడు. ఎవిన్ లూయిస్ 42 (25 బంతుల్లో) ప‌రుగులు చేశారు. ట్రినిబాగో నైట్ రైడర్స్(Trinbago Knight Riders) టాప్ ఆర్డర్ విఫలమైనా, పొలార్డ్ – పూరన్ మ‌రో వికెట్ పడకుండా జాగ్ర‌త్త‌గా ఆడి జట్టుకు మెరుగైన స్కోర్ అందించారు. మరోవైపు పాట్రియట్స్ ఓపెనర్లు అద్భుతంగా ఆడినా, మిడిలార్డ‌ర్, టెయిలెండ‌ర్స్ స‌రిగా ఆడ‌క‌పోవ‌డంతో జట్టు 13 పరుగుల తేడాతో ఓడిపోయింది. బౌలింగ్‌లో నాథన్ ఎడ్వర్డ్ 3 వికెట్లు, మహ్మద్ అమీర్ 2 వికెట్లు తీశారు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పిన కిరాన్ పొలార్డ్​  ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపిక చేశారు. పోలార్డ్ ఇన్నింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “పోలార్డ్ బ్యాక్ ఇన్ ఫామ్” అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. CPL 2025లో ఇది వరకే పలువురు స్టార్ ఆటగాళ్లు మెరుపులు మెరిపించగా, ఇప్పుడు పొలార్డ్ షో ఆకట్టుకుంది.