అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Virat Kohli | ఆస్ట్రేలియాలో అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఆసీస్-భారత్ మూడు వన్డేల సిరీస్ కోసం టీమిండియా (Team India) ప్లేయర్లు ఇప్పటికే కంగారుల గడ్డపై అడుగుపెట్టారు. అక్టోబర్ 15న వన్డే స్క్వాడ్ ఆస్ట్రేలియాకు చేరిన తర్వాత, భారత్ జట్టు వెంటనే ప్రాక్టీస్‌ను ప్రారంభించింది.
ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత బ్లూ జెర్సీలో మళ్లీ కనిపించిన స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma)ల కెరియర్, ఈ సిరీస్‌తో తేలిపోతుంది. అందుకే ఈ టోర్నీకి భారీ క్రేజ్ ఉంది. ఇక ప్రాక్టీస్ సెషన్స్, పబ్లిక్ ఇంట్రాక్షన్స్‌లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల ఆటోగ్రాఫ్ కోసం ఆసీస్‌లో ఉన్న భారతీయ అభిమానులు ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ బుడ్డోడు క్యాప్‌పై కోహ్లీ సంతకం తీసుకోవాలని వచ్చాడు.
Virat Kohli | ఫ్యాన్ మూమెంట్..
కోహ్లి ఆటోగ్రాఫ్ అందించగానే బుడ్డోడు సంతోషంతో గ్రౌండ్‌లో పడి పల్టీలు కొట్టే క్షణం అందరినీ ఆకట్టుకుంది. ఈ బ్యూటీఫుల్ మూమెంట్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారడంతో, “డ్రీమ్ ఆఫ్ విరాట్ కోహ్లి ఫ్యాన్”గా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఈ ఘటన కేవలం ఆ బుడ్డోడు డ్రీం మాత్రమే కాదు, ప్రతి విరాట్ కోహ్లి అభిమాని జీవితంలో అనుభవించదగిన అనుభవం. ఆటోగ్రాఫ్ పొందిన తర్వాత ఉత్సాహంతో ఆ బుడ్డోడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కటి రెస్పాన్స్ దక్కించుకుంటుంది. క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఆస్ట్రేలియా (Australia) గడ్డపై విరాట్ కోహ్లికు మంచి రికార్డు ఉన్నందున ఈ సిరీస్ ఆయన బ్యాట్ పవర్‌ను ప్రదర్శించేందుకు గొప్ప అవకాశంగా మారనుంది.
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 దృష్ట్యా కోహ్లి, రోహిత్ శర్మలు తమ ఫామ్‌ను నిరూపించి జట్టులో స్థిరమైన ప్రదర్శన ఇవ్వాల్సిన అవసరం ఉంది. యువ ఆటగాళ్లు జట్టులోకి అడుగుపెడుతున్న సందర్భంలో సీనియర్ స్టార్ బ్యాటర్లు జట్టు విజయానికి కీలకంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద, విరాట్ కోహ్లి ఆటోగ్రాఫ్ కోసం ఒక చోటా ఫ్యాన్ ఉత్సాహం వైరల్ కావడం, భారతీయ క్రికెట్ అభిమానులకు ప్రేరణగా మారడంతో పాటు, ఈ సిరీస్‌పై ఉత్సాహాన్ని మరింత పెంచుతోంది.