అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kiara Advani | సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బాలీవుడ్ భామ కియారా అద్వానీ. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
ఆ చిత్రం సూపర్ హిట్‌గా నిలవడంతో కియారాకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంతో టాలీవుడ్లో మంచి గుర్తింపు దక్కడంతో ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం (Director Boyapati Srinu) లో తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో హీరోయిన్గా నటించే ఛాన్స్ వచ్చింది. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది.
Kiara Advani | రీఎంట్రీతో రచ్చ…
రామ్ చరణ్‌తో నటించిన సినిమా డిజాస్టర్ కావడంతో తిరిగి కియారా మళ్లీ బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. చాలా కాలం తర్వాత మళ్లీ రామ్ చరణ్ సినిమాతోనే టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇచ్చింది కియారా. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్ లో ఆమె కీలక పాత్రలో కనిపించింది. భారీ బడ్జెట్, అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. ఇదిలా ఉండగా, బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా (Siddharth Malhotra)ను ప్రేమించి వివాహం చేసుకున్న కియారా, ఇటీవలే తల్లి కూడా అయ్యింది. మాతృత్వ ఆనందాన్ని ఆస్వాదించిన అనంతరం ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
తాజా సమాచారం ప్రకారం, రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా (Pan India Movie)లో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ‘టాక్సిక్’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో నయనతార కూడా కీలక పాత్రలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాపై కియారా భారీ అంచనాలే పెట్టుకుంది.