ePaper
More
    HomeజాతీయంKharge vs Tharoor | ఖర్గే వర్సెస్ థరూర్.. పరోక్ష విమర్శలు గుప్పించుకున్న నేతలు

    Kharge vs Tharoor | ఖర్గే వర్సెస్ థరూర్.. పరోక్ష విమర్శలు గుప్పించుకున్న నేతలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Kharge vs Tharoor | కాంగ్రెస్ వ్యతిరేక వైఖరిని అవలంభిస్తున్న సీనియర్ నేత శశిథరూర్(Shashi Tharoor)పై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) పరోక్షంగా విమర్శలు ఎక్కుపెట్టారు. దేశమే ప్రధానమని చెబుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) సేవలో తరిస్తున్నారని ఖర్గే విమర్శించారు. అయితే, ఆయన వ్యాఖ్యలను శశిథరూర్ తిప్పికొట్టారు. ‘ఆకాశం ఎవరికీ చెందదు రెక్కలు మీవి.. ఎగరడానికి ఎవరి అనుమతి అడగకండి’ అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

    Kharge vs Tharoor | శశి అంత ఇంగ్లిష్ రాదన్న ఖర్గే

    కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Congress MP Shashi Tharoor) వైఖరిపై సొంత పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంత కాలంగా ఆయన వ్యవహార శైలిని నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా, కేంద్రాన్ని ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ థరూర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్(Congress)లో కలకలం రేపాయి. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు ఖర్గే (Kharge) బుధవారం విలేకరుల సమావేశంలో థరూర్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఆయనలా నాకు ఆంగ్లం చదవడం రాదు. కానీ ఆయన లాంగ్వేజ్ చాలా బాగుంటుంది.

    READ ALSO  Vice President | ఉప‌రాష్ట్ర‌ప‌తి రేసులో నితీశ్‌, వీకే స‌క్సెనా.. ప‌రిశీల‌న‌లో థ‌రూర్‌, మ‌నోజ్ సిన్హా పేరు కూడా..

    ఆ కారణంగానే ఆయనను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (Congress Working Committee) సభ్యుడిని చేశామని’ ఎగతాళి చేసేలా మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీకి దేశమే ప్రధానమని, దేశం కోసం పోరాడుతూనే ఉంటామన్నారు. మేం దేశం కోసం పరితపిస్తుంటే, కొందరు ప్రధాని కోసం తపిస్తున్నారని పరోక్షంగా థరూర్‌ను ఉద్దేశించి విమర్శించారు. ప్రధాని మోదీని (PM Modi) కీర్తిస్తూ ఇటీవల శశిథరూర్‌ రాసిన వ్యాసంపై ఆయన ఆసక్తికరంగా స్పందించారు. “ప్రజలు తమకు ఎలా అనిపిస్తే అది రాస్తారు, మేము దానిపై స్పందించకూడదని అనుకుంటున్నాం. మేము దేశ కోసం ఐక్యతను కోరుకుంటున్నాము.

    దేశం కోసం పోరాడుతూనే ఉంటాము.. దాదాపు 34 మంది సీడబ్ల్యూసీ సభ్యులు, 30 మంది ప్రత్యేక ఆహ్వానితులు ఉండగా, వారిలో, ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది.. ఆయన చెప్పేది ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. థరూర్ వ్యవహార శైలిపై విలేకరులు అడిగిన ప్రశ్నకు “దేశాన్ని కాపాడటం గురించి మేము పోరాడుతున్నాం.. ఎవరైనా వేరే దాని గురించి ఆందోళన చెందుతుంటే, మీరు అతనిని అడగాలి.” అని ఖర్గే బదులిచ్చారు. రాజకీయ విభేదాలున్నా (political differences) విపక్షాలన్నీ ఇండియన్ ఆర్మీకి వెన్నుదన్నుగా నిలుస్తాయని తెలిపారు. తమకు దేశం ముఖ్యమని (నేషన్ ఫస్ట్), తాము పదేపదే ఈ విషయాన్ని చెబుతున్నామని, దేశం కంటే మోదీనే ముఖ్యమని కొందరు వ్యక్తులు నమ్ముతుంటారని పరోక్షంగా విమర్శలు చేశారు.

    READ ALSO  Train Accident | ఒడిశాలో పట్టాలు తప్పిన రైలు

    Kharge vs Tharoor | ఎవరి అనుమతి అక్కర్లేదు..

    అయితే, ఖర్గే (Kharge) తనను తప్పుబడుతూ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే శశిథరూర్‌ (Shashi Tharoor) తీవ్రంగా స్పందించారు. ఖర్గే ఆరోపణలు తిప్పికొడుతూ నిగూఢార్థం వచ్చేలా ‘ఎక్స్’లో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ‘ఎగరడానికి అనుమతి అడక్కండి. రెక్కలు మీవి. ఆకాశం ఏ ఒక్కరిదీ కాదు’ అని ఆ ట్వీట్లో శశిథరూర్ పేర్కొన్నారు.

    Latest articles

    Prime Minister Modi | ఇందిర‌ను అధిగ‌మించిన మోదీ.. 4078 రోజులు ప్ర‌ధానిగా సేవ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Prime Minister Modi | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మ‌రో రికార్డు సాధించారు. ప్ర‌ధానిగా అత్య‌ధిక...

    Donald Trump | ట్రంప్ పిచ్చి నిర్ణ‌యాలు.. ఆందోళ‌న‌లో నిపుణులు.. ఇండియ‌న్ల‌కు ఉద్యోగాలు ఇవ్వొద్ద‌ని తాజా వ్యాఖ్య‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Donald Trump | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వ‌చ్చాక తీసుకుంటున్న నిర్ణ‌యాలు తీవ్ర...

    Sundar Pichai | బిలియనీర్‌ క్లబ్‌లోకి సుందర్‌ పిచాయ్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sundar Pichai | బిలియనీర్‌ క్లబ్‌లోకి సుందర్‌ పిచాయ్‌ అడుగుపెట్టారు. టెక్‌ దిగ్గజం గూగుల్ మాతృసంస్థ...

    TTD | తిరుమలలో పెరిగిన రద్దీ.. 21 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు ​

    అక్షరటుడే, తిరుమల: TTD: కళియుగ దైవం వేంకటేశ్వరస్వామి సన్నిధికి భక్తులు రద్దీ భారీగా పెరిగింది. దీంతో తిరుమల Tirumala...

    More like this

    Prime Minister Modi | ఇందిర‌ను అధిగ‌మించిన మోదీ.. 4078 రోజులు ప్ర‌ధానిగా సేవ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Prime Minister Modi | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మ‌రో రికార్డు సాధించారు. ప్ర‌ధానిగా అత్య‌ధిక...

    Donald Trump | ట్రంప్ పిచ్చి నిర్ణ‌యాలు.. ఆందోళ‌న‌లో నిపుణులు.. ఇండియ‌న్ల‌కు ఉద్యోగాలు ఇవ్వొద్ద‌ని తాజా వ్యాఖ్య‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Donald Trump | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వ‌చ్చాక తీసుకుంటున్న నిర్ణ‌యాలు తీవ్ర...

    Sundar Pichai | బిలియనీర్‌ క్లబ్‌లోకి సుందర్‌ పిచాయ్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sundar Pichai | బిలియనీర్‌ క్లబ్‌లోకి సుందర్‌ పిచాయ్‌ అడుగుపెట్టారు. టెక్‌ దిగ్గజం గూగుల్ మాతృసంస్థ...