ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKharge Meeting | ఖర్గే సభకు తరలిరావాలి.. డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్

    Kharge Meeting | ఖర్గే సభకు తరలిరావాలి.. డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Kharge Meeting | హైదరాబాద్​లో ఈ నెల 4న నిర్వహించనున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున​ ఖర్గే (AICC President Mallikarjun Kharge) సభకు జిల్లా నుంచి కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి రావాలని డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు (DCC President Kailas Srinivas Rao) పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు.

    కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో పాటు పార్టీ అనుబంధ సంస్థల నాయకులతో ఎల్​బీ స్టేడియంలో (LB Stadium) శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారని, ప్రతి నియోజకవర్గం నుంచి సుమారు 600 మంది పార్టీ అనుబంధ సంస్థల నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్, పంపరి లక్ష్మణ్, రాజాగౌడ్, గంగాధర్, కిరణ్ కుమార్, సుధాకర్ పాల్గొన్నారు.

    More like this

    Yellareddy | అటవీ భూముల పరిశీలన

    అక్షర టుడే, ఎల్లారెడ్డి : Yellareddy | మండలంలోని వెల్లుట్ల(Vellutla) శివారులోని హేమగిరి ప్రాంతంలో గల అటవీ భూములను...

    KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ అని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల...

    Vice President Election | ముగిసిన ఉప రాష్ట్రపతి ఎన్నిక.. 96 శాతం పోలింగ్.. ఓటేసిన అధికార, విపక్ష ఎంపీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President Election | ఉప రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. మంగళవారం ఉదయం 10...