Khammam House Demolition | పేదల ఇళ్ల కూల్చివేత.. ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత

ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వ భూమిలో నిర్మించుకున్న ఇళ్లను అధికారులు కూల్చి వేస్తున్నారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Khammam House Demolition | ఖమ్మం జిల్లా (Khammam District)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వ భూమిలో నిర్మించుకున్న ఇళ్లను అధికారులు కూల్చి వేస్తున్నారు. స్థానికులు అడ్డుకోవడంతో భారీగా పోలీసులు మోహరించారు.ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం (Raghunathapalem Mandal) వి వెంకటాయపాలెం సమీపంలోని 60 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిలో గత కొంతకాలంగా పలువురు నివాసం ఉంటున్నారు.

దాదాపు 600 మంది ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. కొందరు గుడిసెలు వేసుకొని జీవిస్తుండగా.. మరికొందరు శాశ్వత నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ భూమిపై కొంతకాలంగా కోర్టులో వివాదం నడుస్తోంది. ఇటీవల కోర్టు సదరు భూమిని స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో మంగళవారం ఉదయం అధికారులు రంగంలోకి దిగారు.

Khammam House Demolition | భూదాన్​ భూములు

వి వెంకటాయపాలెం (V Venkatayapalem) సమీపంలోని భూదాన్​ భూములను స్వాధీనం చేసుకోవడానికి అధికారులు పోలీసుల సాయంతో వచ్చారు. పెద్ద ఎత్తున జేసీబీలతో తెల్లవారుజామున చేరుకున్నారు. దాదాపు వెయ్యి మంది పోలీసులు మోహరించారు. అయితే స్థానికులు వారితో వాగ్వాదం చేశారు. తాము ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని, ఇప్పుడు ఎక్కడకు వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఖాళీ చేయడానికి సమయం ఇవ్వాలని కోరారు. అయితే పోలీసులు వారిని పక్కకు తప్పించి కూల్చివేతలు చేపట్టారు. పోలీసులు భారీగా మోహరించడంతో హైటెన్షన్​ నెలకొంది.బాధితులు మాట్లాడుతూ.. అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకున్నామని అర్ధంతరంగా వెళ్లిపోమ్మంటే తమ బతుకు ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను అడ్డుకునేందుకు పలువురు యువకులు ప్రయత్నించారు. పదేళ్లుగా ఇక్కడే నివసిస్తున్నామని, తమకు పట్టాలు ఇవ్వాలని వారు పోరాడుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం కూల్చివేతలు చేపట్టింది.

Related articles

Rythu Bharosa Delay | రైతు భరోసా లేనట్లేనా.. ఆందోళనలో అన్నదాతలు

యాసంగి సీజన్​కు సంబంధించి రైతు భరోసాను ప్రభుత్వం ఇంకా జమ చేయలేదు. రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

Stock Market Crash | భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్‌పై బేర్ పట్టు బిగించడంతో ప్రధాన సూచీలన్నీ నష్టాల బాటలో పయనిస్తున్నాయి. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 715 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 197 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

Trump Comments | ఎంతకాలం ఉంటానో తెలియదు.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

డోనాల్డ్​ ట్రంప్​ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎంతకాలం బతికి ఉంటానో తెలియదని అన్నారు.

Virosh Wedding Celebrations | ఉదయ్‌పూర్‌లో ‘విరోష్’ పెళ్లి వేడుకలు ప్రారంభం.. పూల్ పార్టీ, జపనీస్ థీమ్ డిన్నర్‌తో సందడి

టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ–రష్మిక మందన్న వివాహ వేడుకలు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 26న పెళ్లి పీటలెక్కనున్న ఈ జంట ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ను అత్యంత సన్నిహితుల మధ్య నిర్వహిస్తోంది. సోమవారం పూల్ పార్టీ, జపనీస్ థీమ్ క్యాండిల్‌లైట్ డిన్నర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.