అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Khairatabad Ganesh | హైదరాబాద్ (Hyderabad) లో వినాయకుడి నిమజ్జనం ఘనంగా సాగుతోంది. వేలాది విగ్రహాలు శోభాయాత్రగా నిమజ్జనం కోసం తరలి వెళ్తున్నాయి.
గణేశ్ నిమజ్జనం (Ganesh immersion) సందర్భంగా నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. లక్షలాది మంది భక్తులను గణనాథులను తిలకించేందుకు తరలి వచ్చారు. గణపతి బొప్పా మోరియా అంటూ సందడి చేస్తున్నారు. నగరంలోని ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం పూర్తయింది.
Khairatabad Ganesh | క్రేన్ నంబర్ 4 దగ్గర..
ఖైతరాబాద్ గణేశ్ నిమజ్జన యాత్రలో లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శనివారం ఉదయం స్వామివారి శోభాయాత్ర ప్రారంభం అయింది. సైఫాబాద్ ఓల్డ్ పోలీస్ స్టేషన్, ఇక్బాల్ మినార్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, ఎన్టీఆర్ మార్గ్‌లో హుస్సేన్ సాగర్ వద్ద గల నాలుగో నంబర్ క్రేన్ వద్దకు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వినాయకుడు చేరుకున్నాడు. అనంతరం వెల్డింగ్ పనులు చేపట్టారు. బహుబలి క్రేన్ సాయంతో అధికారులు ప్రశాంతంగా బడా గణేశుడి నిమజ్జనం పూర్తి చేశారు. ప్రత్యేక పూజల అనంతరం వినాయకుడు గంగమ్మ ఒడికి చేరారు.
Khairatabad Ganesh | భక్తుల సందడి
ట్యాంక్‌బండ్ (Tank Bund) వద్ద భక్తుల సందడి నెలకొంది. వేలాది వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తీసుకు వస్తుండటంతో భక్తులు, ప్రజలతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. ప్రజలకు ఇబ్బందులు కల్గకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం తిలకించేందుకు భక్తులు పోటీ పడ్డారు. క్రేన్ నంబర్ 4 సమీపంలోకి భక్తులను పోలీసులు అనుమతించలేదు.కొద్ది దూరంలోనే భక్తులను నిలిపివేశారు. మరోవైపు వినాయక విగ్రహాలు భారీ ఎత్తున వస్తుండటంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది.
Drone Visuals
హుస్సేన్ సాగర్ వద్ద ఖైరతాబాద్ గణనాథుడి డ్రోన్ విజువల్స్ pic.twitter.com/Bh2Uklc3Lm
— PulseNewsBreaking (@pulsenewsbreak) September 6, 2025