అక్షరటుడే, ఇందూరు: కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలకు నిరసిస్తూ కేజీబీవీ నాన్‌టీచింగ్ వర్కర్లు సమ్మెకు దిగనున్నారు. ఈనెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నారు. ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ (KGBV Non-Teaching Workers) యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్ తెలిపారు. మంగళవారం డీఈవో కార్యాలయంలోని (DEO Office) ఏడీ నాగజ్యోతికి సమ్మె నోటీసులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు శాపంగా మారిన నాలుగు లేబర్ కోడ్లకు (Labor codes) వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు. తక్షణమే కనీస వేతనాలు రూ.26 వేలు ఇవ్వాలన్నారు. ఉద్యోగ, ఆరోగ్య భద్రత (Health safety) కల్పించాలని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులందరిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుమలత, నాయకులు రాధ, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.