అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tirumala | తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) కీలక షెడ్యూల్‌ను ప్రకటించింది. భక్తుల రద్దీని నియంత్రిస్తూ, నిబంధనల ప్రకారం బ్రేక్ దర్శనం (VIP లెటర్ ద్వారా) మరియు రూ.300 ప్రత్యేక దర్శనానికి ప్రత్యేక తేదీలను నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రానికి చెందిన భక్తులకు బ్రేక్ దర్శనం పొందేందుకు వీలైన తేదీలు ఆదివారం, మంగళవారం, బుధవారం, గురువారం కాగా VIP లెటర్‌ను ముందుగానే జీఈఓ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. అదే రాష్ట్రానికి చెందిన భక్తులు రూ.300 దర్శనాన్ని సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం రోజుల్లో పొందవచ్చు. కాగా ఆ రోజే లెటర్‌ను సమర్పించడం తప్పనిసరి.
Tirumala | ఈ సూచనలు పాటించండి..
ఇదే విధంగా తెలంగాణ(Telangana) రాష్ట్ర భక్తులకు సోమవారం మరియు మంగళవారం రోజుల్లో VIP లెటర్ సమర్పించి బ్రేక్ దర్శనం పొందేందుకు అవకాశం ఉంది. రూ.300 ప్రత్యేక దర్శనం కోసం బుధవారం మరియు గురువారం రోజుల్లో లెటర్ సమర్పించి దర్శనం పొందవచ్చు. ఈ మేరకు భక్తులు తమ లెటర్‌ను తిరుమలలోని జీఈఓ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. టీటీడీ ప్రకారం బ్రేక్ దర్శనం కోసం లెటర్ ముందుగానే సమర్పించాలి. రూ.300 దర్శనం కోసం కూడా అదే రోజున లెటర్ సమర్పించాలి. లెటర్ సమర్పించాల్సిన ప్రదేశం జీఈఓ కార్యాలయం, తిరుమల.
భక్తులు గమనించాల్సిన విషయం ఏమిటంటే, తిరుమల దర్శనం కోసం ముందుగానే తగిన ఏర్పాట్లు చేసుకొని ఈ నిబంధనలను పాటించడం వల్ల మంచి దర్శన అనుభూతి పొందవచ్చని అధికారులు సూచిస్తున్నారు. స్వామివారి దర్శనార్థం వచ్చే ప్రతి భక్తుడు ఈ సమాచారం ప్రకారం తన షెడ్యూల్‌ను ప్లాన్ చేసుకోవాలి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి , బాట గంగమ్మ గుడి దగ్గర వరకు క్యూ ఉంది. సర్వదర్శనం భక్తులకు 20 గంటల సమయం పడుతుంది . 300 రూ..శీఘ్రదర్శనంకు 4 గంటల సమయం పడుతుంది . సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 6 గంటల సమయం పడుతుంది. నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 75,188 కాగా, నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 31,640 . నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: ₹2.66 కోట్లు