ePaper
More
    HomeతెలంగాణRation Shops | రేషన్​కార్డులపై కీలక అప్​డేట్​.. పెరగనున్న దుకాణాల సంఖ్య

    Ration Shops | రేషన్​కార్డులపై కీలక అప్​డేట్​.. పెరగనున్న దుకాణాల సంఖ్య

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Ration Shops | తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ ప్రభుత్వం(Congress government) కొత్తగా రేషన్​ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు నూతన కార్డుల పంపిణీని కసరత్తు కూడా ప్రారంభించింది.

    ఇప్పటికే పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల యాడింగ్​ ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే లబ్ధిదారులకు నూతన కార్డులు అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే రాష్ట్రంలో ఏళ్లుగా కొత్త రేషన్​ కార్డులు(New Ration Cards) ఇవ్వలేదు. అలాగే కొత్తగా కుటుంబ సభ్యులను చేర్చే అవకాశం కూడా కల్పించలేదు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్​ లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరగనుంది. దీంతో ప్రభుత్వం రేషన్​ దుకాణాల సంఖ్య పెంచాలని యోచిస్తోంది.

    Ration Shops | హైదరాబాద్​లో..

    ప్రభుత్వం వన్​ నేషన్​.. వన్​ రేషన్​ విధానం అమలు చేస్తోంది. దీనిలో భాగంగా ఎక్కడి నుంచైనా రేషన్​ బియ్యం తీసుకోవచ్చు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ఎంతోమంది వలస వచ్చి హైదరాబాద్ (Hyderabad city)​ నగరంలో నివసిస్తున్నారు. ప్రస్తుతం రేషన్​ లబ్ధిదారుల సంఖ్య పెరగనుండటంతో హైదరాబాద్​లో బియ్యం పంపిణీకి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ క్రమంలో జీహెచ్​ఎంసీ GHMC ration shops పరిధిలో కొత్తగా రేషన్​షాపులు (New Ration Shops) పెంచేందుకు సివిల్​సప్లయీస్ ​అధికారులు కసరత్తు చేస్తున్నారు.

    Ration Shops | 50 షాపుల ఏర్పాటుకు కసరత్తు

    అధికారులు జీహెచ్​ఎంసీ పరిధిలోని రేషన్​ షాపుల (Ration Shops) వివరాలు సేకరిస్తున్నారు. కాగా.. పలువురు రేషన్​ షాపులను సక్రమంగా తీయడం లేదని, బినామీలు నడుపుతున్నారని ఇటీవల 30 దుకాణాలను రద్దు చేశారు. దీంతో ఈ 30 రేషన్​ దుకాణాలకు అదనంగా మరో 50 కొత్తగా ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ ​పరిధిలో 624 రేషన్​షాపులు నడుస్తున్నాయి. నగరంలో ఇప్పుడు 6,39,451 కార్డులున్నాయి. కొత్త కార్డుల కోసం దాదాపు 4 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో లబ్ధిదారులు, కార్డుల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో అదనంగా 50 దుకాణాలు ఏర్పాటు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...