HomeతెలంగాణRation Cards | కొత్త రేషన్​ కార్డులపై కీలక అప్​డేట్​.. మే నుంచి బియ్యం పంపిణీ

Ration Cards | కొత్త రేషన్​ కార్డులపై కీలక అప్​డేట్​.. మే నుంచి బియ్యం పంపిణీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ration Cards | కొత్త రేషన్​ కార్డుల (new ration cards) కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్​న్యూస్​ చెప్పింది. త్వరలోనే కొత్త కార్డులు అందించడానికి చర్యలు చేపట్టింది. కొత్త కార్డులు వచ్చిన వారికి మే నుంచి బియ్యం పంపిణీ చేయనున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో కొన్నేళ్లుగా కొత్త రేషన్​ కార్డులు ఇవ్వలేదు. దీంతోపాటు మెంబర్లను యాడ్​ కూడా చేయలేదు. కాంగ్రెస్​ ప్రభుత్వం (congress govt) వచ్చాక కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు దరఖాస్తులు కూడా స్వీకరించింది. దీంతో రాష్ట్రంలో లక్షలాది మంది దరఖాస్తులు చేసుకున్నారు.

వచ్చిన దరఖాస్తులు, కుల గణన సర్వే ఆధారంగా ప్రభుత్వం రేషన్​ కార్డులు జారీ చేస్తోంది. అంతేగాకుండా పాత కార్డుల్లో మెంబర్లను యాడ్ add​ చేస్తోంది. వచ్చిన దరఖాస్తులను (applications) వెరిఫై చేస్తూ అధికారులు కార్డులు జారీ చేయడంతో పాటు, కొత్త వారిని యాడ్​ చేస్తున్నారు. ఇప్పటికే పాత కార్డుల్లో పలువురిని యాడ్​ చేయగా.. వారికి ఏప్రిల్​లో బియ్యం కూడా వచ్చింది. అయితే మొత్తం ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు.

Ration Cards | మేలో కొత్త కార్డులు..

కొత్త రేషన్​ కార్డుల కోసం లక్షలాది దరఖాస్తులు రావడంతో విడతల వారీగా కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా మే నెలలో తొలివిడతలో కొందరికి కార్డులు ఇచ్చి బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా ఏప్రిల్​ నెల నుంచి ప్రభుత్వం రేషన్​ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీని ప్రారంభించిన విషయం తెలిసిందే. కొత్త కార్డులు మంజూరు చేస్తే బియ్యం కోటా కూడా పెరగనుంది.