HomeతెలంగాణNew Ration Cards | కొత్త రేషన్​ కార్డులపై కీలక అప్​డేట్​.. కార్డు వచ్చిందో లేదో...

New Ration Cards | కొత్త రేషన్​ కార్డులపై కీలక అప్​డేట్​.. కార్డు వచ్చిందో లేదో ఇలా చెక్​చేసుకోండి..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​:New Ration Cards | రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్​ కార్డుల పంపిణీకి కసరత్తు చేస్తోంది. ఈ నెల 14 నుంచి లబ్ధిదారులకు కొత్త కార్డులు అందించనుంది. రాష్ట్రంలో ఏళ్లుగా కొత్త రేషన్​ కార్డులు లేకపోవడంతో ఎంతోమంది దరఖాస్తు చేసుకున్నారు.

ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తయినట్లు సమాచారం. దీంతో 14న సీఎం రేవంత్​రెడ్డి తుంగతుర్తి(Tungaturthi)లో కొత్త రేషన్​ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు.

New Ration Cards | జనవరి 26న ప్రారంభం

తాము అధికారంలోకి వస్తే కొత్త రేషన్​ కార్డులు పంపిణీ చేస్తామని కాంగ్రెస్​ హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా జనవరి 26న సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) నాలుగు పథకాలను ప్రారంభించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్​ కార్డుల జారీని ఆయన ప్రారంభించారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. వానాకాలం రైతు భరోసా కూడా జమ చేశారు. తాజాగా కొత్త కార్డుల జారీకి ప్రభుత్వం సిద్ధమైంది.

New Ration Cards | కార్డు వచ్చిందో లేదో ఇలా తెలుసుకోవచ్చు

రాష్ట్రంలో కొంతకాలంగా కొత్త కార్డులు(New Ration Cards) లేకపోవడంతో లక్షలాది మంది దరఖాస్తులు చేసుకున్నారు. కులగణన సమయంలో రేషన్​ కార్డు కోసం అప్లై చేశారు. అలాగే మీ సేవా కేంద్రాల ద్వారా సైతం కొత్త రేషన్​కార్డు కూడా దరఖాస్తు పెట్టుకున్నారు. అయితే ఇందులో చాలా మంది అనర్హులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు మొదట పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల యాడింగ్​ ప్రక్రియ పూర్తి చేశారు. కొత్త కార్డుల దరఖాస్తులను వడబోసి అర్హులకు అందజేయడానికి సిద్ధమయ్యారు. కొత్తగా 4.76 లక్షల కార్డులు మంజూరు చేయనున్నట్లు సమాచారం.

అయితే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారు తమకు వచ్చిందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. నిత్యం రెవెన్యూ కార్యాలయాల(Revenue Offices) చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఆన్​లైన్​ కార్డు స్టేటస్​ చెక్​ చేసుకోవచ్చు. ఆల్​రెడీ పాత కార్డులో పేరు ఉండి కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే కార్డు రాదు. ముందుగా పేరు డిలీట్​ చేయించుకొని కొత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

https://epds.telangana.gov.in/FoodSecurityAct/?x=q8nLZTbKyLP1m4U7UjXBNw వెబ్​సైట్​ ఓపెన్​ చేసి కార్డు డిటెయిల్స్​ తెలుసుకోవచ్చు. మీ సేవ ద్వారా కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే ఈ వెబ్​సైట్​ ఓపెన్​ చేసి దరఖాస్తు నంబర్​ ఎంటర్​ చేయాలి. అప్పుడు కార్డు స్టేటస్​ వస్తుంది. అలాగే ఆఫ్​లైన్​లో దరఖాస్తు చేసుకుంటే ఆ నంబర్​తో స్టేటస్​ చూసుకోవచ్చు. అలాగే కుటుంబ సభ్యులు యాడ్​ అయ్యారో లేదో కూడా తెలుసుకోవచ్చు. దీనికోసం ఇప్పటికే ఉన్న రేషన్​ కార్డు నంబర్​ ఎంటర్​ చేస్తే సరిపోతుంది.