ePaper
More
    HomeతెలంగాణLRS | ఎల్​ఎర్​ఎస్​పై కీలక అప్​డేట్​.. మరోసారి గడువు పెంచిన ప్రభుత్వం

    LRS | ఎల్​ఎర్​ఎస్​పై కీలక అప్​డేట్​.. మరోసారి గడువు పెంచిన ప్రభుత్వం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:LRS | లే‌అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ (LRS) గడువు పెంచుతూ ప్రభుత్వం మరో సారి ఉత్తర్వులు జారీ చేసింది. ప్లాట్ల క్రమబద్దీకరణ కోసం బీఆర్​ఎస్(BRS)​ హయాంలో దరఖాస్తులు స్వీకరించారు. అయితే ఆ ప్రక్రియను తర్వాత చేపట్టకుండా అలాగే వదిలేశారు.

    కాంగ్రెస్(Congress)​ అధికారంలోకి వచ్చాక ఎల్​ఆర్​ఎస్​ కింద ప్లాట్లను క్రమబద్దీకరించుకుంటే 25 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది. మార్చి 31 వరకు ప్లాట్లను క్రమబద్దీకరించుకున్న వారికి ఎల్​ఆర్​ఎస్​ ఫీజులో 25శాతం డిస్కౌంట్​ ఇస్తామని తెలిపింది. అయితే ప్రజల నుంచి వచ్చిన వినతులు, స్పందన మేరకు ఈ గడువును తర్వాత ఏప్రిల్​ 30 వరకు పెంచింది. మళ్లీ మే 31 వరకు ఛాన్స్​ ఇచ్చిన అధికారులు తాజాగా జూన్​ 30 వరకు గడువు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మున్సిపల్ శాఖ(Municipal Department) ఆదేశాలు జారీ చేసింది.

    LRS | రూ.రెండు వేల కోట్ల ఆదాయం

    రాష్ట్రంలో ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం దాదాపు 25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇప్పటి వరకు 7 లక్షల మంది మాత్రమే ఫీజు చెల్లించి రెగ్యూలరైజేషన్(Regularization)​ చేసుకున్నారు. దీంతో ప్రభుత్వానికి రూ.రెండు వేల కోట్ల ఆదాయం వచ్చింది. దరఖాస్తు చేసుకున్న అందరు ఫీజు చెల్లిస్తే రూ.10 వేల కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం రానుంది. ప్రస్తుతం సంక్షేమ పథకాల అమలుకు నిధుల కొరత ఉండటంతో ప్రభుత్వం ఎల్​ఆర్​ఎస్​ గడువు మరోసారి పెంచింది. దీంతో కొంతైన ఆదాయం సమకూరుతుందని సర్కార్ యోచిస్తోంది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...