అక్షరటుడే, వెబ్‌డెస్క్: Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు(High Court) ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు ఆర్డినెన్స్‌ను గవర్నర్ (Governer) ఆమోదం కోసం పంపింది. ఒకటి, రెండు రోజుల్లో ఆర్డినెన్స్‌ను ఆయన ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అనంతరం ప్రభుత్వం స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ క్రమంలో తాజాగా పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ డీపీవోలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఎన్నికల నిర్వహణకు గ్రామాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఎన్నికల కోసం అవసరమైన సామగ్రి గ్రామాల్లో అందుబాటులో ఉందా లేదా అనే వివరాలు సేకరించాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ(Principal Secretary) ఆదేశించారు. శనివారం వివరాలు సేకరించి నివేదిక పంపించాలని సూచించారు. అవసరమైన సామగ్రి కోసం ఇండెంట్ పెట్టాలన్నారు.
Local Body Elections | సిబ్బందికి శిక్షణ
స్థానిక ఎన్నికల (Local Body Elections) కోసం ఇప్పటికే సిబ్బందికి ప్రభుత్వం సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. బీఎల్వోలు, ఎన్నికల అధికారులకు కీలక సూచనలు చేసింది. దీంతో త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Local Body Elections | స్థానాల ఖరారు
ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను సైతం ఖరారు చేసింది. రాష్ట్రంలో 12,778 గ్రామ పంచాయతీలు, 1.12 లక్షలు వార్డులు ఉన్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 31 జెడ్పీ చైర్పర్సన్లు, 566 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నట్లు ప్రకటించింది. 566 ఎంపీపీలు, 5,773 ఎంపీటీసీలు ఉన్నట్లు వివరాలు వెల్లడించింది. బీసీ రిజర్వేషన్ల(BC Reservations)పై ఆర్డినెన్స్ వచ్చాక ఆయా స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేయనుంది.