అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Indiramma Houses | పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని (Indiramma Housing Scheme) ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి విడతల వారీగా రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయనుంది. జనవరి 26న ఈ పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించారు.
మొదట కొన్ని గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్ట్ కింద ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అనంతరం నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేశారు. తొలి విడతలో 4.50 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti) తెలిపారు. ఇళ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేస్తోంది. బేస్మెంట్ వరకు పనులు పూర్తయితే రూ.లక్ష లబ్ధిదారుల ఖాతాలో వేస్తున్నారు. అయితే తమ ఇంటి నిర్మాణానికి సంబంధించిన బిల్లులు ఎక్కడి వరకు వచ్చాయోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. బిల్లుల కోసం నిత్యం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. బిల్లులకు సంబంధించిన స్టేటస్ లబ్ధిదారులు ఆన్లైన్లో చెక్ చేసుకునేలా పోర్టల్ అందుబాటులోకి తెచ్చింది.
Indiramma Houses | ఆఫీస్‌లకు వెళ్లకుండానే..
ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే ఆన్లైన్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. లబ్ధిదారుల వివరాలు, ఇళ్ల పురోగతి, బిల్లుల చెల్లింపుల స్టేటస్‌లో వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ తెలిపారు. https://indirammaindlu.telangana.gov.in వెబ్సైట్లో లబ్ధిదారుల ఫోన్ నంబర్, ఆధార్, రేషన్ కార్డు వివరాలు నమోదు చేసి బిల్లుల చెల్లింపు స్టేటస్ తెలుసుకోవచ్చు.