ePaper
More
    HomeతెలంగాణBC Reservations | బీసీ రిజర్వేషన్లపై కీలక అప్​డేట్​.. గవర్నర్​ వద్దకు చేరిన ఆర్డినెన్స్

    BC Reservations | బీసీ రిజర్వేషన్లపై కీలక అప్​డేట్​.. గవర్నర్​ వద్దకు చేరిన ఆర్డినెన్స్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: BC Reservations | స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అసెంబ్లీలో బిల్లులు (assembly Bills)ఆమోదించి కేంద్రానికి పంపింది.

    అయితే కేంద్రం నుంచి ఆ బిల్లులకు ఆమోదం రాకపోవడంతో ఆర్డినెన్స్​ ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల మంత్రివర్గం ఆమోదం తెలపగా.. తాజాగా ఆర్డినెన్స్​ను సిద్ధం చేసిన ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది. ఈ ఆర్డినెన్స్​ను గవర్నర్​ ఆమోదిస్తే బీసీ రిజర్వేషన్లు (BC reservations) అమలులోకి రానున్నాయి.

    BC Reservations | వేగం పెంచిన ప్రభుత్వం

    రాష్ట్రంలో సెప్టెంబర్​ 30 లోపు పంచాయతీ ఎన్నికలు (panchayat elections) నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్​ను (BC reservation ordinance) మంగళవారం గవర్నర్​ ఆమోదం కోసం పంపింది. 2018లో తీసుకొచ్చిన చట్టానికి సవరణ చేస్తూ తాజాగా ఆర్డినెన్స్​ తీసుకు వచ్చారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా ముసాయిదా డ్రాఫ్డ్‌ను ప్రభుత్వం గవర్నర్​కు పంపింది. ఆయన ఆమోదించగానే.. ఆర్డినెన్స్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది.

    READ ALSO  Kamareddy BJP | జడ్పీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోవాలి

    BC Reservations | 2018లో తగ్గింపు

    బీఆర్​ఎస్​ (BRS Party) హయాంలో పంచాయతీ రాజ్​ చట్టం 2018 తీసుకోచ్చారు. ఆ సమయంలో బీసీ రిజర్వేషన్లు 32శాతం నుంచి 22శాతానికి తగ్గించారు. అంతేగాకుండా పదేళ్లు ఒకే రిజర్వేషన్​ ఉండేలా చట్టంలో పొందుపరిచారు. అయితే తాజాగా ఆ చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్​ సిద్ధం చేసింది. 2018లో 22 శాతానికి తగ్గించిన బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచింది.

    Latest articles

    Kamareddy congress | దళిత సీఎం మాట మార్చిన ఘనత బీఆర్​ఎస్​ది..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy congress | తెలంగాణ రాష్ట్రం వస్తే దళితున్ని సీఎం చేస్తామని హామీ ఇచ్చి మర్చిపోయిన...

    Education Department | పైసలిస్తేనే పర్మిషన్​..!

    అక్షరటుడే, ఇందూరు : Education Department | జిల్లా విద్యాశాఖలో (district education department) పలువురు సిబ్బంది తీరుపై...

    Special Officer | ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారిగా రాజీవ్​గాంధీ హనుమంతు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Special Officer | ఉమ్మడి నిజామాబాద్​ (Nizamabad) జిల్లా ప్రత్యేకాధికారిగా ఐఏఎస్​ అధికారి రాజీవ్​గాంధీ...

    Sp Rajesh chandra | ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి

    అక్షరటుడే, బాన్సువాడ: Sp Rajesh chandra | ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని ఎస్పీ రాజేష్...

    More like this