అక్షరటుడే, వెబ్డెస్క్:Indiramma Houses | రాష్ట్ర ప్రభుత్వం(State Government) నిరుపేదలకు ఇళ్లు అందించడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. జనవరి 26న రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. తొలుత మండలానికి ఓ గ్రామంలో లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ మేరకు లబ్ధిదారులకు అధికారులు ఇళ్ల మంజూరు పత్రాలు అందజేస్తున్నారు. పలు గ్రామాల్లో ఇంటి నిర్మాణాలు కూడా ప్రారంభిస్తున్నారు.
Indiramma Houses | రూ.22.64 కోట్లు విడుదల
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు(Indiramma Houses) నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రతి సోమవారం నిధులు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు జూన్ 9న ఇందిరమ్మ ఇళ్ల బిల్లులకు మరో రూ.22.64 కోట్లు విడుదల చేసింది. ఇప్పటివరకు మొత్తం రూ.98.64 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. పైలట్ గ్రామాల్లో 9,877 ఇళ్ల పనులు బేస్మెంట్ వరకు పూర్తయ్యాయి.