HomeతెలంగాణPhone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Phone Tapping Case | తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్​ కేసులో phone tapping case మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బీఆర్​ఎస్ brs​ హయాంలో కీలక స్థానాల్లో పని చేసిన ఉన్నతాధికారులను విచారించడానికి దర్యాప్తు బృందం యత్నిస్తోంది. ఫోన్​ ట్యాపింగ్​ కేసులో ప్రధాన నిందితుడు నాటి ఎస్ఐబీ sib ఓఎస్​డీ ప్రభాకర్​రావు prabhakar rao​ కొంతకాలంగా అమెరికాలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన ముందస్తు బెయిల్​ కోసం హైకోర్టులో పిటిషన్​ వేశారు.

Phone Tapping Case | రివ్యూ కమిటీ అనుమతితోనే..

ప్రభాకర్​రావు తరఫు న్యాయవాది హైకోర్టులో వాదిస్తూ ఎస్​ఐబీలో లీగల్​గానే ఫోన్​ ట్యాపింగ్​ జరిగిందని చెప్పారు. రివ్యూ కమిటీ అనుమతితోనే 2023 డిసెంబరులో ఫోన్ ట్యాపింగ్ డేటా ధ్వంసం చేశామని కోర్టుకు ప్రభాకర్​రావు తెలిపారు. దీంతో దర్యాప్తు బృందం నాటి రివ్యూ కమిటీ సభ్యులను విచారించడానికి సిద్ధం అవుతోంది. ఇందులో నాటి సీఎస్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలన విభాగం అధికారులు ఉండటం గమనార్హం.

Phone Tapping Case | బెయిల్​ పిటిషన్​ కొట్టివేత

అమెరికాలో ఉన్న ప్రభాకర్​రావు prabhakar rao తాను అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతున్నట్లు కోర్టుకు తెలిపాడు. తనకు ముందస్తు బెయిల్​ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశాడు. అయితే ఆయన బెయిల్​ పిటిషన్​ను కోర్టు కొట్టివేసింది. దీంతో ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Must Read
Related News