అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Operation Sindoor | ఆపరేషన్ సిందూర్‌లో కీలక పాత్ర పోషించిన వారికి కేంద్ర ప్రభుత్వం గురువారం వీర్ చక్ర అవార్డులను ప్రకటించింది. భారత వైమానిక దళ అధికారులు జీపీ కెప్టెన్ రంజీత్ సింగ్ సిద్ధూ, జీపీ కెప్టెన్ మనీష్ అరోరా, జీపీ కెప్టెన్ అనిమేష్ పట్ని, జీపీ కెప్టెన్ కునాల్ కల్రా, వింగ్ కమాండర్ జాయ్ చంద్ర, స్క్వాడ్రన్ లీడర్ సార్థక్ కుమార్, స్క్వాడ్రన్ లీడర్ సిద్ధాంత్ సింగ్, స్క్వాడ్రన్ లీడర్ రిజ్వాన్ మాలిక్, ఫ్లైట్ లెఫ్టినెంట్ ఆర్ష్వీర్ సింగ్ ఠాకూర్‌ను అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది.
పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను (Pakistan terrorist camps) ధ్వంసం చేయడానికి సాహసోపేతమైన మిషన్లు నిర్వహించిన ఫైటర్ పైలట్లతో సహా తొమ్మిది మంది భారత వైమానిక దళ అధికారులకు దేశపు మూడో అత్యున్నత యుద్ధకాల శౌర్య గౌరవం అయిన వీర్ చక్ర అవార్డుకు (Vir Chakra award) ఎంపిక చేసింది. అసమాన ధైర్యసాహసాలు, కచ్చితత్వం, యుద్ధ రంగంలో అద్భుతమైన వ్యూహాత్మక నైపుణ్యాలను ప్రదర్శించారని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది.
Operation Sindoor | 26 మంది సిబ్బందికి వాయుసేన పతకం
భారత వైమానిక దళానికి (Indian Air Force) చెందిన మొత్తం 26 మంది అధికారులు, వైమానిక దళ సిబ్బందికి ‘వాయుసేన పతకం’ (శౌర్యం) లభించింది. పాకిస్తాన్‌లోని లక్ష్యాలపై కచ్చితమైన దాడులు చేసిన ఫైటర్ పైలట్లు, అలాగే భారత భూభాగంపై పాకిస్తాన్ ప్లాన్ చేసిన ప్రతి దాడిని విజయవంతంగా అడ్డుకున్న S-400. ఇతర వైమానిక రక్షణ వ్యవస్థలను నిర్వహిస్తున్న సిబ్బందికి కూడా పురస్కారాలను ప్రకటించింది.
Operation Sindoor | 13 మందికి యుద్ధ సేవా పతకం
దాడులను అమలు చేయడంలో, భారత వైమానిక ప్రాంతాన్ని రక్షించడంలో అత్యుత్తమ పాత్ర పోషించిన 13 మంది వైమానిక దళ అధికారులకు ‘యుద్ధ సేవా పతకం’ ప్రకటించారు. విశిష్ట జాబితాలో ఎయిర్ వైస్ మార్షల్ జోసెఫ్ సువారెస్, AVM ప్రజువల్ సింగ్, ఎయిర్ కమోడోర్ అశోక్ రాజ్ ఠాకూర్ ఉన్నారు.
Operation Sindoor | ‘సర్వోత్తం యుద్ధ సేవా పతకం’..
ఇద్దరు సీనియర్ భారత ఆర్మీ అధికారులకు (Indian Army officers) దేశంలో అత్యున్నత యుద్ధకాల విశిష్ట సేవా గౌరవం ‘సర్వోత్తం యుద్ధ సేవా పతకం’ కూడా లభించింది. ఈ ఏడాది శౌర్య పురస్కార గ్రహీతల జాబితాలో నలుగురికి కీర్తి చక్రాలు, నలుగురికి వీర్ చక్ర, ఎనిమిది మందికి శౌర్య చక్రా అవార్డులు లభించాయని ఆర్మీ అధికారులు తెలిపారు.