అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KCR | ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో (KCR Farm House) బీఆర్ఎస్ నాయకులు (BRS Leaders) ఆదివారం కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి హరీశ్‌రావు, కరీంనగర్ జిల్లా నుంచి కేటీఆర్, సంజయ్, ఆదిలాబాద్ నుంచి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. నల్గొండ నుంచి జగదీష్ రెడ్డి, నిజామాబాద్ నుంచి వేముల ప్రశాంత్‌రెడ్డి హాజరయ్యారు.
KCR | 8న కరీంనగర్లో సభ
బీసీ రిజర్వేషన్ల (BC Reservations) కోసం ఈ నెల 8న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కరీంనగర్లో సభ (Karimnagar Sabha) నిర్వహించనున్నారు. రిజర్వేషన్లపై ఇప్పటికే జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత సోమవారం నిరాహార దీక్ష చేయడానికి సిద్ధమయ్యారు. బీసీ రిజర్వేషన్ల బిల్లులను కేంద్రం ఆమోదించాలని ఈ నెల 6న కాంగ్రెస్ (Congress) నాయకులు ఢిల్లీలో ధర్నా చేపట్టనున్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కరీంనగర్లో పెద్ద ఎత్తున సభ నిర్వహించడానికి నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో సభ ఏర్పాట్లపై కేసీఆర్ నాయకులకు దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం. బీసీ సభకు భారీగా జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. అలాగే జిల్లాల్లో రాజకీయ పరిణామాలు, పార్టీ పరిస్థితిపై చర్చించినట్లు తెలిసింది.
KCR | కాళేశ్వరం నివేదికపై..
కాళేశ్వరం కమిషన్ (Kaleswaram Commission) జులై 31న ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఈ నివేదికపై సోమవారం మంత్రివర్గంలో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం నివేదికపై బీఆర్ఎస్ నాయకులు ఎర్రవల్లిలో చర్చించినట్లు తెలిసింది. నివేదికపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.. అనంతరం ఎలా ముందుకు వెళ్లాలని మంతనాలు జరిపారు. ఇటీవల ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) వ్యవహారం బీఆర్ఎస్లో తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై చర్చించినట్లు తెలిసింది. అలాగే స్థానిక ఎన్నికల (Local Body Elections)పై కేసీఆర్ నాయకులు పలు సూచనలు చేశారు.