HomeUncategorizedCeasefire | ప్రధాని మోదీ కీలక సమావేశం

Ceasefire | ప్రధాని మోదీ కీలక సమావేశం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ceasefire | భారత్​, పాకిస్తాన్​ కాల్పుల విరమణను (Ceasefire) అంగీకరించిన నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (pm modi) కీలక సమావేశం నిర్వహించారు. ఆయన నివాసంలో రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​సింగ్​, జాతీయ భద్రత సలహాదారు NSA అజిత్‌ దోవల్‌, త్రివిధ దళాధిపతులతో ప్రధాని సమావేశం నిర్వహించారు. ఆపరేషన్​ సిందూర్​ (operation sindoor) అనంతర పరిణామలు, కాల్పుల విమరణ, తాజా పరిస్థితులపై ఆయన చర్చిస్తున్నారు.

భారత్‌-పాకిస్తాన్​ చర్చల అనంతరం కాల్పుల విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి కాల్పుల విరమణ Ceasefire అమలులోకి వచ్చింది. అయితే పాకిస్తాన్​ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి (Ceasefire violation) శనివారం రాత్రి భారత్​లోని పలు ప్రాంతాపై దాడులకు యత్నించింది. ఈ దాడులను భారత సైన్యం తిప్పికొట్టింది. పాక్​ ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై సమావేశంలో చర్చిస్తున్నారు.

కాల్పుల విరమణ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంతోపాటు.. సరిహద్దుల్లో పరిస్థితి కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే సోమవారం ఇరుదేశాల ఆర్మీ జనరల్స్ (army generals)​ సమావేశంపై కూడా భేటీలో చర్చించనున్నారు. తాజా పరిస్థితులపై మరికొద్దిసేపట్లో విదేశాంగ శాఖ, రక్షణశాఖ మీడియాకు వివరాలు వెల్లడించనుంది.