అక్షరటుడే, వెబ్డెస్క్: PM modi | భారత్ – పాక్ ఉద్రిక్తతల (india – pakistan tension) నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశం (key meeting at PM narendra modi house) నిర్వహించారు. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (national security advisor ajit doval), త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్ (operation sindoor) తర్వాత పాక్ చేసిన దాడులు (pakistan attacks), భారత్ వాటిని తిప్పికొట్టిన తీరును వారు మోదీకి వివరించారు. ఈ సందర్భంగా సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉంటూ దాయాది దేశానికి బుద్ధి చెప్పాలని మోదీ సూచించినట్లు సమాచారం.
