అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Keshava Rao | ఛత్తీస్‌గఢ్ Chhattisgarhలోని నారాయణపూర్ Narayanpur జిల్లాలో బుధవారం ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్ encounter చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 27 మంది మావోయిస్టులను బలగాలు హతమార్చాయి. ఇందులో మావోయిస్టు అగ్రనేత, సీపీఐ మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు nambala keshava rao కూడా ఉన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌పై ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. భద్రతా బలగాలను అభినందించారు.
Keshava Rao | బలగాలను చూసి గర్విస్తున్నాం
ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై ప్రధాని మోదీ pm modi ట్వీట్ చేశారు. ఈ అద్భుతమైన విజయానికి మన బలగాలను చూసి గర్విస్తున్నట్లు ఆయన తెలిపారు. మావోయిజం ముప్పును నిర్మూలించడానికి, ప్రజలకు శాంతి, పురోగతితో కూడిన జీవితాన్ని అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
Keshava Rao | నక్సలిజాన్ని నిర్మూలిస్తాం..
దేశంలో 2026 మార్చి 31 వరకు నక్సలిజాన్ని నిర్మూలిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా home minister amit shah మరోసారి తెలిపారు. నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఈ ఎన్కౌంటర్ ఒక గొప్ప విజయం అని ఆయన అభివర్ణించారు.
‘ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో జరిగిన ఆపరేషన్‌లో మన భద్రతా దళాలు 27 మంది భయంకరమైన మావోయిస్టులను మట్టుబెట్టాయి. వారిలో సీపీఐ-మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి, నక్సల్ ఉద్యమానికి వెన్నెముక అయిన నంబాల కేశవ్ రావు అలియాస్ బసవరాజు ఉన్నారు. నక్సలిజంపై భారత్ చేసిన మూడు దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా కలిగిన నాయకుడిని మన దళాలు మట్టుబెట్టడం ఇదే మొదటిసారి‘ అని అమిత్ షా పోస్ట్ చేశారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయిన తర్వాత 54 మంది నక్సలైట్లను అరెస్టు చేశారని, 84 మంది నక్సలైట్లు లొంగిపోయారని ఆయన వివరించారు.